మహాభారతం స్ఫూర్తితో ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాని ఆయన పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎనౌన్స్ చేసింది.

అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో వర్క్ చేయడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు.అతనితో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేసుకున్నాడు.

ప్రభాస్ తో స్లార్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ మూవీని ప్రశాంత్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి అప్పుడే ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ గా కథని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా కథని మహాభారతంలో అర్జునుడు పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ప్రశాంత్ నీల్ సిద్ధం చేసినట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.చాలా పవర్ ఫుల్ హీరోయిజం ని ఈ క్యారెక్టరైజేషన్ ద్వారా ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది.రక్తంలో తడిసిన ముద్దయింది మాత్రమే గుర్తుంచుకోవాల్సిన నేల అనే డైలాగ్ ని జోడించడం ద్వారా తారక్ కోసం తాను సిద్ధం చేసిన కథ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ప్రశాంత్ నీల్ చూచాయగా రివీల్ చేశాడు.

Advertisement

ఇండియన్ హిస్టరీలో మహాభారతానికి మించి మాస్ యాక్షన్ స్టొరీ ఉండదనే చెప్పాలి.అలాంటి కథాంశం స్ఫూర్తిగా తీసుకొని తారక్ కోసం స్టొరీ సిద్ధం చేసాడంటే కచ్చితంగా అది అద్బుతంగా నందమూరి ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఉంటుందని మాత్రం తెలుస్తుంది.

మరి ఈ స్టొరీపై వస్తున్న వార్తలలో నిజమెంత అనేది తెలియాలంటే ప్రశాంత్ నీల్ రివీల్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు