అందుబాటులోకి జగనన్న ఆక్సిజన్ బ్యాంకులు..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా పరిస్థితి దారుణంగా ఉంది.

ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు 20 వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతూ ఉండటంతో ఆక్సిజన్ బెడ్లు అందక చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్న కొద్దీ కేసులు పెరుగుతూ ఉండటంతో.కరోనా బారిన పడిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి తరుణంలో జగనన్న ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల తో జగనన్న ఆక్సిజన్ బ్యాంకులు అక్కడి ఎమ్మెల్యే అందుబాటులోకి తెచ్చారు.కర్నూలు ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో జగనన్న కోవిడ్ కేర్ సెంటర్.

Advertisement

ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చారు.జిల్లాలో ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో ఇక్కడినుండే పంపిణీ చేస్తున్నారు.

ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల ని అమెరికా నుండి తెప్పించారు.

తమ నియోజకవర్గం ఎమ్మెల్యే తమ ప్రాణాల పట్ల ఈ రీతిలో జాగ్రత్త తీసుకోవటంతో కర్నూలు జిల్లాలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  .

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు