ప్రాణవాయువు పట్ల శ్రద్ధ వహించని అధికారులు.. ఎక్కువవుతున్న ఆక్సిజన్ లీకేజీలు.. !

ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్దితుల దృష్ట్యా ఆక్సిజన్, అమృతవాయువుగా మారిపోయింది.ఈ ఆక్సిజన్ అందక ఎందరో పేషెంట్స్ మట్టిలో కలసిపోతున్నారు.

మానవుడు తన అభివృద్ధి కోసం విచ్చలవిడిగా ప్రకృతిని నాశనం చేసి ఇప్పుడు స్వచ్చమైన ప్రాణవాయువు కోసం అలమటిస్తున్నాడు.ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆక్సిజన్ లీకేజీ సమస్యలు నెలకొంటున్నాయి.

అసలే ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ఇలా వ్యర్ధం అవుతున్న ఆక్సిజన్ వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు.ఇక తాజాగా విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయిందట.

కాగా ట్యాంకర్‌లోని ఆక్సిజన్‌ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైందని అధికారులు వెల్లడిస్తున్నారట.అయితే ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో ఆక్సిజన్ లీకైనప్పటికీ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలుస్తుంది.

Advertisement

లేదంటే మరెన్ని ప్రాణాలు ఆక్సిజన్ లీకేజీలా గాల్లో కలిసిపోయేవో ఊహకు కూడా అందకుండా ఉంది.ఇకనైన ఈ విషయం పట్ల శ్రద్ద వహిస్తే మంచిదని కరోనాతో యాతన అనుభవిస్తున్న వారి మనోగతం అంట.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు