70 సంవత్సరాల రికార్డును బద్దల కొట్టిన క్రికెటర్.. ఎవరంటే..?

క్రికెట్ అంటే చాలా మందికి ప్రాణం.అందులోనూ ఐపిఎల్ వచ్చిదంటే ఇక పండగ వాతావరణం నెలకొంటుంది.

అయితే క్రికెట్ ఆడే అవకాశం చాలా మందికి రాదు.జెర్సీ సినిమాలో లాగా చాలా మందికి సరైన టైంలో అవకాశాలు రావు.

అయినా కానీ కొంత మంది పట్టుదలగా క్రికెట్ ఆడటం కోసం ఎదురుచూస్తుంటారు.అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆ వ్యక్తి 18 ఏళ్ల పాటు ఫ్టస్ క్లాస్ క్రికెట్ ఆడాడు.18 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన ఆ క్రికెటర్ తొలి టెస్టు ఆడటానికి దాదాపు రెండు దశాబ్దాలు వెయిట్ చేయాల్సి వచ్చింది.దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు.

కానీ సెలెక్టర్లు మాత్రం ఏనాడూ అతడిపై కరుణ చూపలేదు.పాకిస్తాన్‌కు చెందిన తబిష్ ఖాన్‌ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడటానికి 18 ఏళ్ల పాటు వెయిట్ చేశాడు.

Advertisement

ఎట్టకేలకు జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో అరంగేట్రం చేసి తొలి టెస్టు తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు.ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వయసులో అరంగేట్రం చేసి తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి 70 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

పాకిస్తాన్‌లోని కరాచిలో 1984 డిసెంబర్ 12న తబిష్ ఖాన్ జన్మించాడు.చిన్నతనం నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్న తబిష్ తన 18వ ఏట దేశవాళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు.సింధ్, కరాచీ కింగ్స్, కరాచీ వైట్స్, పాకిస్తాన్ టెలివిజన్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.18 ఏళ్ల దేశవాళీ కెరీర్‌లో 598 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీశాడు.జింబాబ్వేతో జరిగిన టెస్టులో తీసిన వికెట్ అతడికి 599వ ఫస్ట్ క్లాస్ వికెట్.

కాగా, టెస్టుల్లో అరంగేట్రం చేయక ముందు దేశవాళీ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు 598 తీసిన ఏసియస్ క్రికెటర్‌గా తబీష్ రికార్డు సృష్టించాడు.ఏనాడూ తన ఆశను వదలకుండా కష్టపడ్డాడు.

చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.తబిష్ ఖాన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు