పవన్ కి ఈ విషయం ' గుర్తు ' లేదా ? 

జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.కోట్లాదిమంది పవన్ ను ఆరాధించే వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.

సినీ గ్లామర్, సామాజికవర్గం అండదండలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి.దీంతో జనసేన రాజకీయ భవిష్యత్ కు అవకాశం పుష్కలంగా ఉంది.

పవన్ అభిమానులు, జనసైనికులు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు పాటుపడుతూ ఉండడంతో, ఏ ఇతర పార్టీలకు లేనంత అవకాశం ఆ పార్టీకి ఉంది.కాకపోతే పార్టీని ముందుకు నడిపించే క్రమంలో పవన్ ఒత్తిడితో పాటు, కన్ఫ్యూజ్ అవుతుండడం, ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం, పొత్తు పెట్టుకుని అవతల పార్టీకి మేలు జరిగే విధంగా, జనసేన కు నష్టం జరిగే విధంగా వ్యవహరించడం ఇలా అనేక కారణాలతో ఆ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది.పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడానికి రాజకీయ వ్యూహాలు సక్రమంగా లేకపోవడమే కారణం.2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి 7 శాతం ఓట్లు లభించాయి.ఇదంతా పవన్ అభిమానులు, ఆ సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉండటమే.

కానీ ఆ ఓటింగ్ శాతం పెంచుకునే విషయంలో పవన్ తడబాటుకు గురవుతున్నారు.ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

Advertisement

ఆ పార్టీతో భవిష్యత్తులోనూ కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.బీజేపీ-జనసన పొత్తు కారణంగా జనసేన తీవ్రంగా నష్టపోతోంది.

ప్రతి దశలోనూ బిజెపి కోసం జనసేన త్యాగం చేయాల్సిన పరిస్థితి.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది.బీజేపీ ఒత్తిడితోనే వెనక్కి తగ్గింది.ఇప్పుడు అదే ఆ పార్టీకి శాపంగా మారింది.జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ను కోల్పోవాల్సి వచ్చింది.2025 వరకు పార్టీ గుర్తు జనసేనకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయింది.దీనికి కారణం జనసేన పోటీకి దూరంగా ఉండటమే.

ఇటీవల వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసినా, ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు దక్కలేదు.ప్రస్తుతానికి ఏదో విధంగా గట్టెక్కాద్దామని అనుకున్న, రాబోయే రోజుల్లో మాత్రం ఈ వ్యవహారాలు జనసేనకి ఇబ్బందులు తెచ్చిపెడతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

పార్టీకి గుర్తు అనేది చాలా కీలకమైన విషయం.ఆ విషయాన్ని పవన్ నిర్లక్ష్యం చేయడం, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వస్తుండడం ఇవన్నీ జనసేన ఉనికికే ప్రమాదకరంగా మారినట్లు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు