కరోనా వల్ల టాలీవుడ్ కు నష్టమెంతో తెలుసా..?

గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి నష్టం మరింత ఎక్కువగా ఉందని సమాచారం.

ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ కు ఏకంగా 1200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సీనియర్ నిర్మాతలు చెబుతున్నారు.సెకండ్ వేవ్ ఉధృతి మరికొన్ని రోజులు కొనసాగితే ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల నిర్మాతలకు వడ్డీల భారం అంతకంతకూ పెరుగుతోంది.ప్రతి సంవత్సరం తెలుగులో 100 నుంచి 150 సినిమాల వరకు విడుదలవుతున్నాయి.

ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు సమ్మర్ సీజన్ లో రిలీజవుతాయి.అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు విడుదల చెసే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్ కావాల్సిన మిడిల్ రేంజ్ హీరోల, పెద్ద హీరోల సినిమాలు వాయిదా పడ్డాయి.సీటింగ్ నిబంధనలు, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు, కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్ల యజమానులు స్వచ్చందంగా థియేటర్లను మూసివేస్తున్నారు.

ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆ ప్రభావం హీరో మార్కెట్ పై పడే అవకాశం ఉంది.ఇతర రంగాలతో పోలిస్తే సినిమా రంగంపై వైరస్ ప్రభావం ఎక్కువగా పడుతోంది.

యూనిట్ లో ఒక్కరికి కరోనా సోకినా హీరోలంతా ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.థియేటర్లు తెరుచుకున్నా సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.

మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు