రెండు రోజుల నుండి టిక్ టాక్ భార్గవ్ చేసిన నేరం గురించి వార్తలు బాగా వస్తున్నాయి.అతను ఓ మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆమెను గర్భవతిని చేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఇక అతడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉండగా.అతడిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ ఘటన గురించి ప్రస్తుతం దేశం మొత్తం వ్యాపించగా.అతడిపై తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి.
ఫన్ బకెట్ అనే పేరుతో టిక్ టాక్ వీడియోలు లు చేస్తూ సెలబ్రిటీగా మారిన భార్గవ్.తాజాగా లైంగిక కేసులో అడ్డంగా దొరికాడు.14 ఏళ్ల బాలికను నమ్మించి గర్భవతిని చేయగా.ఆ బాలిక బట్టలు మార్చుకునే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఇ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
పెందుర్తి పోలీసులు ఇతడిపై ఏప్రిల్ 16న దిశ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే ఆ బాధితురాలు గురించి ఎటువంటి ఆధారాలు చట్టప్రకారం బయటికి తెలియనియకపోగా గతంలో ఇతడితో కలిసి వీడియోలు చేసిన అమ్మాయిల గురించి పుకార్లు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ ఘటన కలిసిన రోజే నిత్య అనే అమ్మాయి ఈ విషయానికి తనకు సంబంధం లేదంటూ, అతడితో మాట్లాడక ఏడాది అవుతుందని, ఆ బాధితురాలు తను కాదని తెలిపింది.ఇక తనపై పుకార్లు చేస్తున్న కొందరు తన పేరును, ఫోటోలను, వీడియోలను వాడుతున్నారని వాటిని డిలీట్ చేయమని వీడియో ద్వారా కోరింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో అమ్మాయి పేరు మౌనిక వినిపించగా.ఈమె కూడా గతంలో తర్వాత వీడియోలు చేసింది.
ఇక ఈమె కూడా ఓ వీడియో ద్వారా స్పందించగా.ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.
అంతేకాకుండా గతంలో ఎంతో మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో లోబర్చుకొని శారీరకంగా సంబంధం పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇలా పలు బాధితులు పోలీసులకు భారీగా ఫిర్యాదు చేస్తున్నారు.