తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికి నిలిచి పోయే సినిమా ‘బాహుబలి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.బాహుబలి రెండు పార్ట్‌లు కూడా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
రెండు పార్ట్‌లకు కలిపి దాదాపుగా 300 కోట్ల వరకు రాజమౌళి ఖర్చు చేసి ఉంటాడనే టాక్ ఉంది.ఇక కలెక్షన్స్ విషయంలో దాదాపుగా రెండు వేల అయిదు వందలకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి.
ఇక ఇతర రైట్స్ ద్వారా మరో అయిదు వందల కోట్ల వరకు వచ్చి ఉంటాయి.

ఇంతటి సంచలన చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేయాలనుకోవడం మంచి నిర్ణయం.కాని ఈ సినిమాను రీమేక్ చేయాలనుకోవడం తుగ్లక్ నిర్ణయం.అవును ఇలాంటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వదు.
ఒకవేళ అదే స్థాయిలో తీసినా కూడా ప్రేక్షకులు ఇప్పటికే చూసిన కారణంగా మరోసారి చూస్తారన్న నమ్మకం లేదు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా బాహుబలి గురించి తెలిసి పోయింది.
వెండి తెరపై చూడని వారు బుల్లి తెరపై పదుల సార్లు చూశారు.అలాంటి బాహుబలిని ఇప్పుడు గుజరాతీ బాషలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు అయ్యాయి.

ఇప్పటికే ‘బాహుబలి’ రీమేక్ రైట్స్‌ను భారీ మొత్తానికి ఆర్కా మీడియా వారి నుండి గుజరాతీ మూవీ మేకర్స్ అయిన నితిన్ జానీ మరియు తరుణ్ జానీలు దక్కించుకున్నారు.వారు ఈ చిత్రాన్ని గుజరాతీ స్టైల్‌లో కాస్త తక్కువ బడ్జెట్‌తో అదే స్థాయిలో గ్రాఫిక్స్‌ను వాడుకుని తీయాలని భావిస్తున్నారు.అయితే వారు ఎంతగా ప్రయత్నించినా కూడా బాహుబలి స్థాయిని అందుకోవడం సాధ్యం అయితే కాదని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయినా ఇలాంటి నిర్ణయం తీసుకున్న వారికి మైండ్ దొబ్బిందా అంటూ విమర్శలు చేసే వారు కూడా లేకపోలేదు.








