నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున జల్సా సినిమా రి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.పుట్టిన రోజు ప్రత్యేక షో చూసేందుకు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు బారులు తీరారు.
దాదాపుగా 700కు పైగా థియేటర్లలో సినిమా స్క్రీనింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతుంది.అసలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు… ఆపై ప్రత్యేక షో, దాంతో థియేటర్లు దద్దరిల్లాయి.
ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా థియేటర్ని ధ్వంసం చేసి పాడు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.పలు థియేటర్లను పవన అభిమానులు తీవ్రంగా ధ్వంసం చేసిన ఫోటోలు మరియు వీడియోలు కూడా నిన్న నేడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
పలు థియేటర్లు స్క్రీన్లు చించడం మొదలు కొని అద్దాలు పగల గొట్టడం సీట్లు విరగొట్టడం ఇలా దారుణాలకు పాల్పడ్డారు.
ఒక్కో థియేటర్ కి 5 నుండి 25 లక్షల వరకు నష్టం జరిగినట్లుగా సమాచారం అందుతుంది.
ఈ సమయంలో కొందరు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండేవారు ఈ వ్యవహారం పై స్పందిస్తున్నారు.వారు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంత నష్టం చేసినందుకు రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆయా థియేటర్లు లేదా మొత్తం థియేటర్లు ప్రదర్శించకుండా బ్యాన్ చేయాలని, అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు బుద్ధి వస్తుంది అంటూ కొందరు థియేటర్ యజమానులకు సూచిస్తున్నారు.
ఒక వేళ సినిమాలను పవన్ కళ్యాణ్ కి మరియు ఆయన అభిమానులు కు వ్యతిరేకంగా థియేటర్ యాజమాన్యాలు ప్రదర్శించకుంటే అప్పుడు సినిమా విడుదల కాకుండానే థియేటర్లు బద్దలు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా ఆయన అభిమానులు హంగామా చేస్తున్నారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







