పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తన ఆటిట్యూడ్, మ్యానరిజంతో ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టాడు పవన్.ఈ సినిమా హిట్ తర్వాత కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఒకటి.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ చాలా రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది.ఆ తర్వాత ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మళ్ళీ జరగడం లేదు.ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో పవన్ డేట్స్ కోసం ఎదురు దర్శక నిర్మాతలు చూస్తున్నారు.
అందుకే ఈ సినిమా ఉంటుందో ఉండదో.
ఎప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుందో.రిలీజ్ ఎప్పుడు అవుతుందో అని ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం వర్రీ అవుతున్నారు.
మొదటిసారిగా పవన్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడం అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
మరి నిన్న పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుండి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసారు.

ఈ గ్లిమ్స్ చుసిన తర్వాత ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చాలా వరకు పోయింది అనే చెప్పాలి.పవర్ గ్లాన్స్ పేరుతొ విడుదల అయినా చిన్న వీడియోతో అందరిని ఆకర్షించారు.రిలీజ్ అయ్యింది చిన్న వీడియో అయినా కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవన్ యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టు కున్నాయి.
పవన్ కనిపిస్తే చాలు అనుకున్న వారంతా ఏకంగా యాక్షన్ వీడియో రావడంతో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ఏకంగా 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఇలా పవన్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో వీరమల్లు టీమ్ సఫలం అయినట్టు తెలుస్తుంది.
ఇక షూట్ కూడా ఫాస్ట్ గా పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తే మరింత ఖుష్ అయ్యే అవకాశం ఉంది.







