లాక్ డౌన్ పై మమతాబెనర్జీ సెన్సేషనల్ కామెంట్స్..!!

ప్రపంచంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో భారత్ అద్భుతంగా డిఫెండ్ చేసుకోవడం జరిగింది.

ఆ సమయంలో అభివృద్ధి చెందిన మరియు ధనిక దేశాలు అని పిలువబడే.

దేశాలలో కరోనా విలయతాండవం సృష్టించింది.కానీ కరోనా సెకండ్ వేవ్ మాత్రం భారత్ ని బెంబేలెత్తిస్తోంది.

ఇలాంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి.వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అనే కాన్సెప్ట్ పై సీఎం మమతా బెనర్జీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని పేర్కొన్నారు.

Advertisement

మే 5వ తారీఖు నుండి రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు.కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ అనేది పరిష్కారం కాదని పేర్కొన్నారు.

లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.కరోనా కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు