సామాజిక వ‌ర్గాల‌ను అంచ‌నా వేస్తున్న తెలంగాణ పార్టీలు..

ఒక‌ప్ప‌టి కంటే కూడా ఇప్పుడు రాజీకీయాలు చాలా మారిపోయాయి.అన్ని పార్టీల‌కు ఇప్పుడు కుల‌మే బ‌లం.

 Telangana Parties Assessing Social Groups .  Trs, Bjp, Teenmar Malllanaa , Ts Po-TeluguStop.com

కులం లేకుండా ఏ పార్టీ కూడా రాజ‌కీయాలు చేయ‌లేని ప‌రిస్థితులు వ‌స్తున్నాయి.ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా ఉన్న సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికే టికెట్లు కేటాయిస్తూ గెలిపించుకుంటున్నాయి.

ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ అటు ఉంచితే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ సామాజిక వ‌ర్గం అయితే స‌త్తా చాటుతుందో వారికే టికెట్లు కేటాయించాల‌నే సిద్దాంతాన్ని అన్ని పార్టీలు న‌మ్ముతుంటాయి.అయితే ఇప్పుడు తెలంగాణ‌లోని పార్టీలు ఇదే రూట్ లో ఉన్నాయి.

ఇప్పుడు అన్ని పార్టీలు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకునే ప‌నిలో ప‌డ్డాయి.కాగా తెలంగాణ‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను బీజేపీలో చేర్చుకున్నారు ఆ పార్టీ నేత‌లు.

ఈయ‌న సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా బ‌లంగా ఉండ‌టంతో ఆయ‌న్ను బీజేపీలో చేర్చుకున్నారు ఆ పార్టీ నేత‌లు.అయితే ఈయన త‌ర్వాత ఉద్య‌మ నాయ‌కుడు విఠల్ ను కూడా బీజేపీలో చేర్చుకున్నారు.

వీరిద్ద‌రూ కూడా మున్నూరు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం విశేషం.ఇక టీఆర్ఎస్ విష‌యానికి వ‌స్తే వెలమ సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని చేర్చుకునేందుకు రెడీ అవుతోంది.

Telugu Bandi Sanjay, Chalmadaanadha, Ts Congress, Ts Potics-Telugu Political New

ఇందులో భాగంగానే వేముల వాడ నియోజ‌క‌వ‌ర్గంలో చెన్నమనేని రమేష్  మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప్లేస్‌లో చ‌ల్మెడ ఆనంద‌రావును భ‌ర్తీ చేయాల‌ని ప్లాన్ వేస్తోంది.ర‌మేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉందంటూ కోర్టులో కేసులు ఉన్నందున ఏ క్ష‌ణం అయినా ఉప ఎన్నిక రావ‌చ్చ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.కాబ‌ట్టి మాజీ మంత్రి కొడుకు చల్మెడ ఆనందరావును ను పార్టీలో చేర్చుకుంది.కేసీఆర్ సామాజిక వ‌ర్గంకు చెందిన నేత కావ‌డంతో పాటు వేముల వాడ‌లో ఈ వ‌ర్గం చాలా బ‌లంగా ఉండ‌టం క‌లిసి వ‌చ్చే అంశంగా టీఆర్ఎస్ చూస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube