సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో మరియు మంత్రులతో చర్చిస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ లో వైరస్ విజృంభణ కారణంగా పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు.వాయిదా వేసిన తరహాలో ఏపీలో కూడా  అదే రీతిలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

స్కూల్లో కాలేజీలో కూడా తెలంగాణలో మూతపడటం తెలిసిందే.ఇప్పుడు ఇదే మాదిరిగా ఏపీలో అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

అంత మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధించినట్లు ఏపీలో కూడా కర్ఫ్యూ విధించే ఆలోచనలో జగన్ మంతనాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.నైట్ కర్ఫ్యూ తో పాటు పగటి వేళల్లోనూ కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్కుల పై ముంబై.ఢిల్లీ తరహా అమలు చేసే విధంగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

అదేవిధంగా మరో వైపు కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేసే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉంది.ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశంలో విద్యాసంస్థలు అదేవిధంగా పరీక్షలు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు