సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని కరోనా సమానం చూస్తుంది.తరతమ బేధాలు లేకుండా ప్రాణాలు హరించేస్తుంది.
ఇప్పటికే ఒకసారి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని భయపెట్టిన కరోనా ఇప్పుడు మరోసారి తన తీవ్ర రూపం చూపిస్తుంది.కరోనా వేరియంట్ తో సెకండ్ వేవ్ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.
కరోనా మొదటి వేవ్ లో భారత్ కొంత వరకు ఈ వైరస్ ని ఎదుర్కొన్నాం.అయితే సెకండ్ వేవ్ లో మాత్రం ప్రజల నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వం వెరసి ఒక్కసారిగా కరోనా విలయతాండవం చేస్తుంది.
ఎవ్వరినీ వదలడం లేదు.ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు.
ఒక్కరోజులోనే లక్షాలాది కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు.
సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సారి ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.
కరోనా టీకా వేయించుకున్న తర్వాత తమిళ్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ లో కూడా విషాదం చోటు చేసుకుంది.టాలీవుడ్ లో స్టార్ దర్శకుల దగ్గర కో డైరెక్టర్ గా పని చేస్తున్న సత్యం కరోనాతో మరణించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, రాజమౌళి, కృష్ణవంశీ లాంటి దర్శకులతో సత్యం కో డైరెక్టర్ గా పని చేశారు.ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.
హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే మృతి చెందారు.ఈయన మృతి విషయాన్ని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకొని ఎమోషనల్ అయ్యింది.
మా కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్కు గురయ్యాను.ఆయనతో అరవింద సమేత, సాక్ష్యం, అల.వైకుంఠపురములో చిత్రాలు చేశాను.ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా అంటూ పూజా పోస్ట్ చేసింది.