ఆది పురుష్ పై కరోనా ప్రభావం లేదు... క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ లు వాయిదా పడిపోయాయి.

అలాగే సినిమా రిలీజ్ లని కూడా దర్శక, నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుత పరిస్థితిలో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం కష్టం అని అర్ధం కావడంతో రిలీజ్ లని వాయిదా వేస్తున్నారు.ఇదిలా ఉంటే పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లు మాత్రం పక్కాగా కరోనా నిబంధనలని అమలు చేస్తూ షూటింగ్ లు నిర్వహించుకుంటున్నారు.

షూటింగ్ సమయంలో కేవలం సినిమా కోసం వర్క్ చేసే టెక్నికల్ సిబ్బంది, నటీనటులు మాత్రమే ఉండే విధంగా చూసుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి.

అలాగే హిందీలో ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ రాముడుగా నటిస్తున్న అది పురుష్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.ఈ సినిమా అంతా మోషన్ క్యాప్చర్ విధానం ద్వారా కంప్లీట్ స్టూడియోలోనే షూట్ జరుగుతుంది.

Advertisement

ఇక ప్రభాస్, సైఫ్ ఆలీఖాన్, కృతి సనన్ తో పాటు చాలా మంది ఆర్టిస్ట్ లు షూటింగ్ లో పాల్గొంటున్నారు.అయితే కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగ్ అయిపోయిందనే ప్రచారం బిటౌన్ లో వినిపించింది.

అలాగే ఆది పురుష్ సెట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఈ కారణంగా అందరూ కూడా హోం క్వారంటైన్ లో ఉంటున్నారని టాక్ వినిపించింది.దీనిపై దర్శకుడు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు.

మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చాడు.షూటింగ్ ఎలాంటి అవాంతరం లేకుండా సాఫీగా సాగిపోతుంది.

కరోనా అనేది ఆదిపురుష్ సెట్ లోకి ఇప్పటి వరకు రాలేదని కూడా ఆయన పేర్కొన్నాడు.కరోనా పాజిటివ్ అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సినిమాకు ఎలాంటి అడ్డు లేకుండా సాగిపోతుంది.షూటింగ్ జరుగుతున్న తీరు సినిమాపై నమ్మకంను పెంచుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు