న్యూస్ రౌండప్ టాప్ 20

1.21 సీతారాముల కళ్యాణం

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం లో మంగళవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

21వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నిర్వహించబోతున్నారు.

2.రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత

కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుండడంతో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా రేపటి నుంచి శ్రీవారి సర్వ దర్శనం నిలిపివేయాలని టిటిడి నిర్ణయించింది.

3.నా భయం పట్టుకుంది :  మల్లన్న

తెలంగాణ సీఎం కెసిఆర్ కు మల్లన్న భయం పట్టుకుంది అని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను ఓడించేందుకు 200 కోట్లు ఖర్చు పెట్టారని ఓ సమావేశంలో తీన్మార్ మల్లన్న కెసిఆర్ పై విమర్శలు చేశారు.

4.తిరుపతిలో చంద్రబాబు ప్రచారం

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి లో పర్యటిస్తారు.

5.భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి

మాజీ సీఎం, సిపిఎం సీనియర్ నాయకుడు కుంజా బొజ్జి (95) అనారోగ్యం తో బాధపడుతూ భద్రాచలం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

6.కాకినాడ జిజిహెచ్ లో సిఐడి సోదాలు

కాకినాడ నగరంలోని జిజి హెచ్ లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు.టిడిపి ప్రభుత్వ హయాంలో బిల్ చెల్లింపులపై అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

7.డెల్ హై మేయర్ గా చిత్తూరు వాసి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని డెల్ హై మేయర్ గా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ కు చెందిన ఎన్ఆర్ఐ సముద్రాల బాబు రావు కుమారుడు సుధీర్ ఎంపికయ్యారు.

8.కుర్చీ భయంతోనే జగన్ తిరుపతి సభ రద్దు : చింతా

 జగన్ కు సీఎం కుర్చీ భయంతోనే తిరుపతి ఎన్నికల సభను రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు.

9.లోకేష్ , చంద్రబాబు లపై ఎస్సీ ఎస్టీ కేసు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది.టిడిపి అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పై పెట్టిన పోస్టు దళితులను అవమానపరిచిన ఉందని వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ తదితరులు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు.

10.18 జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్

సతీష్ గడ్ లో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర రూపం దాల్చింది.దీనిని అరికట్టేందుకు ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న 18 జిల్లాల్లోనూ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించారు.

11.ఇండోనేషియా లో భూకంపం

ఇండోనేషియా జావా ద్వీపం తీరంలో  భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1 గా నమోదయింది.

12.సుప్రీం కోర్టు ఉద్యోగులకు కరోనా

సుప్రీం కోర్టు లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.కరోనా కలకలం తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారిస్తున్నారు.

13.కుంభమేళాలో 376  కరోనా కొత్త కేసులు

Advertisement

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఆయిన హరిద్వార్ లో మహా కుంభమేళా లో భాగంగా షాహి స్నాన్ కార్యక్రమంలో పాల్గొన్న 372 మంది భక్తులకు కరోనా సోకడం కలకలం రేపింది.

14.వ్యాక్సిన్ల కొరత .ఒడిశాలో 900 వ్యాక్సిన్ కేంద్రాల మూసివేత

దేశ వ్యాప్తంగా టీకా ఉత్సవ్ ఘనంగా ప్రారంభం అయిన వేళ ఒడిశాలో దాదాపు 900 వాక్సిన్ కేంద్రాలు మూత పడ్డాయి.

15.టీకా తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు.

16.బంగ్లాదేశ్ లో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేదం

బంగ్లాదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 20 వరకు అన్ని అంతర్జాతీయ సర్వీసులపై బంగ్లాదేశ్ నిషేధం విధించింది.

17.ఓరుగల్లు లో మిషన్ భగీరథ ప్రారంభం

వరంగల్ వాసులకు మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

18.తుపాకీ మిస్ ఫైర్ : హోంగార్డు భార్య మృతి

విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఓ హోమ్ గార్డ్ భార్య మృతి   చెందింది.

19.పాపికొండల పర్యటన కు గ్రీన్ సిగ్నల్

పాపికొండల పర్యటనకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తూర్పు గోదావరి జిల్లా దేవి పట్నం మండలం కచ్చులురు బోటు ప్రమాదం అనంతరం 13 నెలలుగా ఈ బోటు షికారు ను అధికార్లు వాయిదా వేశారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర .

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు