డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా..? జర జాగ్రత్త సుమీ..!

ఇప్పుడు ఎవ్వరు చుసిన గాని డిజిటల్ పద్దతిలో మాత్రమే మనీ సెండ్ చేస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్ కి బాగా అలవాటు పడిపోయారు.

దీనిని సైబర్ నేరగాళ్లు అదునుగా చేసుకుని అమాయకులను మోసం చేస్తున్నారు.ఇప్పుడు చాలమంది ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు.

అందుకనే ఇప్పుడు మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మీరు మీ పేమెంట్స్ సురక్షితంగా ఆన్లైన్ లో చెల్లింపులు చేయవచ్చు.అవేంటంటే ముందుగా మీరు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేటప్పుడు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు సేవ్ చేయకుండా చూసుకోవడం చాలా మంచిది.

ఇలా చేయడం వల్ల మీ ఆన్‌లైన్ కొనుగోలు పూర్తైన తర్వాత మీ కార్డు సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అందుకని మీరు ఆన్‌లైన్లో కొనుగోలు చేసిన తర్వాత కార్డు వివరాలను సేవ్ చేయకపోవడం లేదా క్లియర్ చేయడం మంచిది.

Advertisement

అలాగే యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న విశ్వసనీయ అధికారిక యాప్‌లను మాత్రమే ఉపయోగించడం మంచిది.ఏవి పడితే అవి డౌన్లోడ్ చేయకపోవడం చాలా మంచిది.

అలాగే మీకు డబ్బులు వచ్చాయి అని ఫేక్ కాల్స్ ను, మెసేజెస్ ను అసలు నమ్మవద్దు.ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడటం మంచిది కాదు.

అంతే కాకుండా పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడం మంచిది., సైబర్ దాడులకు గురికాకుండా ఉండటానికి క్రమం తప్పకుండా పాస్‌వర్డ్‌లు మార్చుతూ ఉండాలి.

అలాగే మీ ఫోన్లో గాని, వేరే ఎక్కడ గాని వాటిని రాసుకోకపోవడం మంచిది అంతే కాకుండా మీ పాస్‌వర్డ్‌లు లేదా ఎటిఎం పిన్ వంటి వివరాలను ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మీ బ్యాంకుకు తెలియజేయండి.ఒన్‌-టైమ్‌-పాస్‌వర్డ్‌(ఓటీపీ) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మరింత భద్రంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లో కూడా చాలా నకిలీ యాప్‌లు ఉన్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌లో దృవీకరించబడిందా లేదా అని నిర్ధారించుకోండి. పబ్లిక్ కంప్యూటర్లు/వై-ఫై నెట్‌వర్క్‌లు వాడొద్దు.

Advertisement

ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, ఇతర మోసపూరిత కార్యకలాపాలు జరిగే అవకాశం ఎక్కువ.కావున పబ్లిక్ పరికరాలు లేదా వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండడం మంచిది.

తాజా వార్తలు