మోదీ పర్యటనలో అపశృతి.. కాల్పుల్లో నలుగురు మృతి.. ?

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌ కు వెళ్లారు.ఇలా మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ దేశంలో వ్యతిరేకత మొదలైంది.

 Bangladesh, Modi Visit, Firing, Four Killed, Pm Modi Bangaldesh Tour Four Member-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఆందోళనలు కూడా చెలరేగాయి.ఇలా ఈరోజు పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీయగా, ఈ ఘర్షణలను అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో కొంత మంది తీవ్రంగా గాయపడగా, నలుగురు మరణించినట్టు సమాచారం.

ఇదే కాకుండా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలకు దిగారు.ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా ఇద్దరు పాత్రికేయులతో పాటు పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డట్లు తెలుస్తుంది.

మరోవైపు మోదీ పర్యటనకు వ్యతిరేకంగా చిట్టగాంగ్‌లోనూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.ఈ నేపథ్యంలో నిరసనకారులను అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్ షెల్స్‌, రబ్బర్‌ బులెట్లు ప్రయోగించగా, ఈ ఘటనలో కూడా నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube