ఒక్క సినిమాతోనే పత్తా లేకుండా పోయిన ఈ తెలుగు హీరోయిన్ మీకు గుర్తుందా... ?

తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన  బ్లేడ్ బాబ్జి చిత్రంలో హీరో అల్లరి నరేష్ సరసన నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ సయాలి భగత్ సినిమా ప్రేక్షకులకి బాగానే గుర్తు ఉంటుంది.

  ఈ అమ్మడు వచ్చి రావడంతోనే అల్లరి నరేష్ వంటి స్టార్ హీరోతో జతకట్టినప్పటికీ ఎందుకో సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.

  దీంతో బాలీవుడ్ కి మోటు ముల్లె సర్దుకుని వెళ్ళిపోయింది.ఈ క్రమంలో ఈ అమ్మడికి బాలీవుడ్ సినిమా ఆఫర్లు బాగానే తలుపు తట్టాయి.

దీంతో ఇక్కడ పెద్దగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోక పోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలో హిందీలో దాదాపుగా 12కు పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్  వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.దీంతో అప్పుడప్పుడు పలు హిందీ సీరియల్స్ లో కూడా కనిపించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది.

Advertisement

  కానీ ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన  నవనీత ప్రతాప్ సింగ్ యాదవ్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

  దీంతో పెళ్లయిన తర్వాత సయాలీ భగత్ పూర్తిగా సినిమా పరిశ్రమకి దూరమైంది.అలాగే రియల్ ఎస్టేట్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర బిజినెస్ రంగాలలో బాగానే రాణిస్తోంది.

అయితే  నటి సయాలీ భగత్ హిందీలో చివరిగా హోమ్ స్టే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది.

దీంతో ఈ అమ్మడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి వ్యాపారాలపై దృష్టి సారించింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు