రిస్కీ డ్రిల్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్..!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని గుర్తింపును సంపాదించుకున్న కంటెస్టెంట్లలో పునర్నవి భూపాలం ఒకరు.

ఉయ్యాల జంపాల, పిట్టగోడ, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాల్లో నటించిన పునర్నవికి ఆ సినిమాల కంటే బిగ్ బాస్ షోనే మంచి పేరు తెచ్చిపెట్టింది.

బిగ్ బాస్ షో తర్వాత పునర్నవికి సినిమా ఆఫర్లు ఎక్కువగా రాకపోయినా వెబ్ సిరీస్ ఆఫర్లు మాత్రం బాగానే వస్తుండటం గమనార్హం.ఫిట్ నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే పునర్నవి భూపాలం తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో పునర్నవి భూపాలం రిస్కీ డ్రిల్ చేశారు.పునర్నవి ఇంట్లో చేసిన కష్టమైన హెడ్ స్టాండ్ డ్రిల్ ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.పునర్నవి రిస్కీ డ్రిల్ ను చూసి మతి పోతుందని.

ఫిట్ నెస్ కోసం పునర్నవి చాలా కష్టపడుతోందని నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.

Advertisement

ఆహా ఓటీటీ కోసం కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ లో నటించిన పునర్నవి భూపాలం త్వరలో కమిట్ మెంటల్ వెబ్ సిరీస్ సీజన్ 2లో కూడా పాల్గొనబోతున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పునర్నవి తరచూ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నారు.పునర్నవి ఫోటోలకు నెటిజన్ల నుంచి వేల సంఖ్యలో లైకులు వస్తుండటం గమనార్హం.

మరోవైపు పునర్నవికి కొన్ని సినిమా ఆఫర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది.పునర్నవి మెడిటేషన్ చేస్తున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే మాత్రం పునర్నవి సినిమాలతో కూడా బిజీ అయ్యే అవకాశం ఉంది.2021 సంవత్సరంలో పునర్నవి భూపాలం సినిమా ఆఫర్లతో సైతం బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు