వావ్.. ఇకపై లగేజీ లేకుంటే విమాన చార్జీల లో రాయితీ..?!

తాజాగా విమాన ప్రయాణికులకు శుభవార్త తెలియజేసింది డొమెస్టిక్ ఎయిర్ లైన్స్.

ప్రయాణికులు ఎటువంటి లగేజ్ లేకుండా ప్రయాణం చేసే వారికి టికెట్ ధరపై రాయితీ ఇవ్వబోతున్నట్లు తెలియచేసింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంటే ముందు దేశీయ విమాన ధరలు ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి.కానీ.

కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి.కరోనా వైరస్ వల్ల వచ్చిన నష్టాలను రాబట్టుకోవడానికి విమాన సంస్థలు చార్జీలు పెంచక తప్పలేదు.

దీంతో విమాన ప్రయాణం చాలా ఖరీదు అయిపోవడం అనేక సమస్యలను తెలిపి తెచ్చిపెట్టింది.ఇందుకు తాజాగా విమాన ప్రయాణం చేసేవారి కోసం సరి కొత్త ఆఫర్ ను ప్రకటించడంతో ప్రయాణికులకు ఊరటనిస్తుంది.

Advertisement

తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.ప్రయాణికులకు చెకింగ్ బ్యాక్ లేకుండా దేశీయంగా ప్రయాణం చేసే వారికి టికెట్ ధరలలో రాయితీ లభిస్తున్నట్లు తెలియజేసింది.

ఎలాంటి చెకింగ్ లగేజ్ లేకుండా కేవలం క్యాబిన్ సామాన్లు మాత్రమే ప్రయాణికులు తీసుకెళ్తే టికెట్ ధరలో రాయితీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది.ఈ జీరో లగేజ్‌ ఛార్జీల ప్రత్యేక పాలసీని అందుబాటులోకి తీసుకొని రావడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందుకు వచ్చింది.

అలాగే జీరో లగేజ్‌ ఛార్జీల పథకం ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే టప్పుడు ప్రయాణికులు ఎలాంటి లగేజ్ తీసుకెళ్లడం లేదు అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది.దీనితో టికెట్ ధరలో లగేజ్ చార్జెస్ కట్ అయి మిగతా మొత్తాన్ని పే చేయాల్సి ఉంటుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద, అలాగే టికెట్ పై కూడా ముద్రించబోతున్నట్లు సంస్థ పేర్కొంది.ఈ జీరో లగేజ్‌ ఛార్జీల పథకం ప్రయాణికులకు కొంతవరకు మేలు చేకూర బోతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు