ఓ పూత పూసిన బంగారు పంజరం.. వైట్‌హౌస్‌లో నివాసంపై జో బైడెన్ వ్యాఖ్యలు

ప్రపంచానికే పెద్దన్న.ఏ దేశాన్నైనా కనుసైగతో శాసించే పోస్ట్, ఒక్క మాటలో చెప్పాలంటే భూగోళం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన పదవి.

ఇవన్నీ చూస్తే మీకు గుర్తొచ్చేది అమెరికా అధ్యక్షుడు.అంగబలం, అర్థబలం రెండూ గుప్పిట్లో వుండే ఈ హోదా కోసం జరిగే పోటీ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు.

దీనిని దక్కించుకున్న వారి ఆనందం కూడా మాటల్లో చెప్పలేం.అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవంలో.

జీవితం చివరి దశలో అధ్యక్షుడిగా గెలవాలన్న కోరికను నిజం చేసుకున్న జో బైడెన్‌ ఎలా ఫీలవుతున్నారో వేరే చెప్పాలా.కానీ వైట్‌హౌస్‌ తనకు బంగారుపూత పూసిన పంజరంలా వుందన్నారు బైడెన్.

Advertisement

అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 4 వారాలు గడుస్తున్న నేపథ్యంలో సీఎన్ఎన్ టౌన్‌హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.వైట్ హౌస్‌లో జీవితం ఇంకా తనకు ఆశ్చర్యంగానే వుందన్నారాయన.

ప్రతి రోజూ ఉదయం లేవగానే తన భార్యను ‘‘ మనం ఎక్కడ వున్నాం ’’ అని అడుగుతానని జో వ్యాఖ్యానించారు.జీవితంలో ఎప్పుడూ నా పనులు నేనే చేసుకోవాలని అనుకుంటానని.

వైట్‌హౌస్ సిబ్బంది రావాలి, వాళ్లే చేయాలని తాను ఎదురుచూడనని ఆయన తేల్చిచెప్పారు.గతంలో తాను ఉపాధ్యక్షుడిగా పనిచేశానని.

అప్పుడు తనకు కేటాయించిన భవనం కంటే వైట్‌హౌస్ పూర్తి విభిన్నమైనదని బైడెన్ గుర్తుచేసుకున్నారు.ఉపాధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లోని ప్రెసిడెంట్ ఛాంబర్ వరకు వెళ్లాను కానీ నివాస ప్రాంతాలు తనకు తెలియదని వెల్లడించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

శ్వేతసౌధంలో నివసించాలన్నది తన కోరిక కాదని.దేశ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం కావాలన్నదే తన ఆశయమని చెప్పారు.

Advertisement

అలాగే తాను గత అధ్యక్షులకు ఫోన్‌చేసి మాట్లాడుతుంటానని వెల్లడించిన బైడెన్ వారి పేర్లు మాత్రం చెప్పలేదు.

కాగా, అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్‌పై బైడెన్ ప్రమాణం చేశారు.78 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం ద్వారా అమెరికా చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు