ఒక్క ఫోన్ కాల్ తో 77 లక్షలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.పోలీసులు ఎంత నిఘా పెట్టిన వారు నేరాలు మాత్రం ఆపడంలేదు.

రోజురోజుకూ మరింత రెచ్చిపోతూ దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండని పోలీసులకే సవాలు విసురుతున్నారు.జనాలను అమాయకులను చేసి బ్యాంకు ఖాతా వివరాలను అనేక పద్ధతుల్లో సేకరిస్తున్నారు.

ఇప్పటికే పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు.తెలియనివారు ఎవరైనా బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే ఇవ్వకూడదని చాలా రకాలుగా చెబుతున్న ప్రజలు మాత్రం వీటిని పెడచెవిన పెడుతున్నారు.

అందుకే రోజురోజుకూ కేసులు ఎక్కువవుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గడంలేదు.సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా ప్రజలకు ఏదొక ఆస చూపి రకరకాలుగా మోసం చేసి బ్యాంకు వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

అలాగే ఒక వ్యక్తి కూడా మోసపోయాడు.ఒక వ్యక్తికి తన సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని మోసం చేసి బ్యాంకు వివరాలను సేకరించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 77 లక్షలను స్వాహా చేసాడు.ఈ ఘటన ఒడిస్సా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఒడిస్సా రాష్ట్రము కటక్ కు చెందిన సనతాన్ మొహంతి అనే వ్యక్తి ఒక డాక్టర్.

ఆయనకు ఫిబ్రవరి 9 వ తారీఖున మీ సిమ్ కార్డు బ్లాక్ అవ్వబోతుందని ఒక ఫోన్ వచ్చింది.మీ సిమ్ ను రీ యాక్టివ్ చేసుకోకపోతే మీ సిమ్ కార్డు బ్లాక్ అవ్వుతుందని చెప్పారు.

అంతేకాదు మీ మొబైల్ కు ఎలాంటి కాల్స్ రావని చెప్పాడు.మల్లి మీ ఫోన్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్ కు లింక్ అయ్యి ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు చెబితే మేమే యాక్టివేట్ చేస్తామని చెప్పి అతన్ని నమ్మించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ మాటలు నిజమే అని నమ్మి వాళ్ళు చెప్పినట్లుగానే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ యాక్సెస్ ను సైబర్ నేరగాళ్లకు ఇవ్వడంతో వాళ్ళ పని మరింత సులువుగా అయ్యింది.తర్వాత బ్యాంకు ఖాతా వివరాలను కూడా తీసుకుని మీ సిమ్ కార్డు యాక్టివేట్ అవుతుందని చెప్పి ఫోన్ పెట్టేసారు.

Advertisement

ఆ తర్వాత వరసగా 6 రోజులపాటు తన ఖాతా నుండి ఆయనకు తెలియకుండానే 77 లక్షలు మాయం అవ్వడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చెయ్యమని చెప్పారు.దేంతో మొహంతి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

తాజా వార్తలు