స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం.. ?

ఏమైందో ఏమో ఈ కొత్త సంవత్సరంలో చిత్రపరిశ్రమలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.మొన్నటికి మొన్న ప్రభాస్ ‘ఆదిపురుష్’.

సెట్‌లో అగ్నిప్రమాదం.అంతలోనే సలార్ చిత్ర యూనిట్ సిబ్బంది కి యాక్సిడెంట్.

ఇప్పుడు పుష్ప షూటింగ్‌లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం.రెండు నెలలు కూడా పూర్తి చేసుకోకుండానే మూడు ప్రమాదాలు చోటు చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుందట.

ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప షెడ్యూల్ లో ఉన్న విషయం తెలిసిందే.అయితే షూటింగ్ ప్రదేశం నుండి బయలు దేరిన అల్లు అర్జున్ కార్వాన్ ను ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద వెనక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టిందట.

Advertisement

అయితే ప్రమాదం సమయంలో వాహనంలో అల్లు అర్జున్ లేడని చిత్రయూనిట్ ప్రకటించింది.కానీ ప్రమాద సమయంలో కార్వాన్ లో సినిమా మేకప్ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.కాగా ఆ కార్వాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారుట.

అందులో తమ అభిమాన హీరో లేడని తెలుసుకున్న వారు ఊపిరి పీల్చుకున్నారట.

Advertisement

తాజా వార్తలు