2021 సంవత్సరంలో తొలి పెద్ద సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఫలితాన్ని అందుకుంది క్రాక్.రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు కాగా ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించారు.
అయితే సినిమా విడుదల రోజున ఆర్థిక వ్యవహారాల వల్ల ఈ సినిమా మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు నిలిచిపోయాయి.అయితే తాజాగా క్రాక్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది.
దర్శకుడు గోపీచంద్ మలినేని నిర్మాత ఠాగూర్ మధు క్రాక్ సినిమా బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.పెండింగ్ రెమ్యునరేషన్ తనకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు గోపీచంద్ మలినేని సమాచారం.
క్రాక్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చినా సినిమా తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం గమనార్హం.

డైరెక్టర్ ఫిర్యాదు గురించి క్రాక్ నిర్మాత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్న నిన్నటినుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.జనవరి 29వ తేదీనే క్రాక్ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల క్రాక్ నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
రాజా ది గ్రేట్ మూవీ తరువాత సరైన సక్సెస్ లేని రవితేజకు క్రాక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
డైరెక్టర్ గోపీచంద్ ఫిర్యాదుతో క్రాక్ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సి ఉంది.
జనవరి నెలలో విడుదలైన అన్ని సినిమాల్లో క్రాక్ సినిమాకు మాత్రమే పాజిటివ్ టాక్ తో పాటు ఆ భారీగా కలెక్షన్లు వచ్చాయి.చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.