ఫ్యాన్స్ కు శుభవార్త చెబుతానన్న శ్రీరెడ్డి.. ఆ విషయమేనా..?

వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు శ్రీరెడ్డి.

ప్రముఖ హీరోయిన్ల దుస్తులపై, సినిమా టీజర్లపై శ్రీరెడ్డి సోషల్ మీడియా ఖాతాల ద్వారా విమర్శలు చేస్తున్నారు.

అయితే తాజాగా శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.శ్రీరెడ్డి ఆ పోస్ట్ లో అభిమానులకు తన నుంచి త్వరలో ఒక సర్ప్రైజ్ ఉంటుందని.

ఆ వార్త విని ఫ్యాన్స్ సంతోషంగా ఉంటారని వెల్లడించారు.అయితే శ్రీరెడ్డి గుడ్ న్యూస్ చెబుతానని చెప్పడంతో చాలామంది నెటిజన్లు ఆమె పెళ్లికి సంబంధించి ఏదైనా విషయాన్ని వెల్లడించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరి కొందరు అభిమానులు మాత్రం శ్రీరెడ్డికి ఏదైనా పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చి ఉండవచ్చని చెబుతున్నారు.అయితే శ్రీరెడ్డి చెబితే మాత్రమే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలిసే అవకాశం ఉంది.

Advertisement

శ్రీరెడ్డి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే మరి కొందరు నెటిజన్లు మాత్రం శ్రీరెడ్డి పోస్ట్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.వివాదాల ద్వారా కొన్నేళ్ల క్రితం వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు.శ్రీరెడ్డి నటించింది తక్కువ సినిమాలే కాగా సినిమాల కంటే కాంట్రవర్సీలే ఆమెను ఎక్కువగా వార్తల్లో నిలిపాయి.

కొందరు హీరోలపై పాజిటివ్ కామెంట్లు చేసే శ్రీరెడ్డి కొందరు హీరోలపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి వార్నింగ్ లు వచ్చినా శ్రీరెడ్డి మాత్రం రివర్స్ లో కౌంటర్లు ఇచ్చారు.

అయితే శ్రీరెడ్డి ఇవ్వబోయే సర్ఫ్రైజ్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే మాత్రమే కొన్ని రోజులు ఆగాల్సిందే.వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఎలాంటి శుభవార్త చెబుతారో చూడాల్సి ఉంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

కొన్ని రోజుల క్రితం ఆచార్య టీజర్ పై శ్రీరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు