వైరల్: గంటలో ఇరవై పుస్తకాలు చదివి ఐదేళ్ల పిల్లోడు రికార్డు

రికార్డులు సృష్టించడం అంత తేలిక కాదు.దాని కోసం కొందరు సంవత్సరాలు కష్టపడుతారు.

కొందరు తమ స్వతహాగానే అందులో నిష్ణాతులై రికార్డులు నమోదు చేస్తుంటారు.తాము ఒక్కసారిగా రికార్డు సాధించిన వ్యక్తిని చూసి ప్రపంచం ఔరా అంటుంది.

అప్పుడు అతని రికార్డును చూసి ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతవుతుంది.మనం ఊహించం కాని చిన్నపిల్లల్లో రికార్డులు బద్దలు కొట్టే ప్రతిభ ఉంటుంది.

కొంత మంది తల్లిదండ్రులు మాత్రమే వారి పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓ ఐదేళ్ల పిల్లాడు గంటలో, ఇరవై పుస్తకాలు చదివి రికార్డు సృష్టించాడు.

Advertisement

కేరళకు చెందిన ఆయుష్ తన తల్లిదండ్రులు దుబాయిలో ఉంటారు.దుబాయి లో ఉండే ఆయుష్ అనే పిల్లాడికి ఐదేళ్లు.

ఒకరకంగా మన భాషలో చెప్పాలంటే పుస్తకాల పురుగు అని చెప్పవచ్చు.ఆయుష్ కు పుస్తకాలంటే చాలా ఇష్టమని తన అభిరుచికి అనుగుణంగా కావలసిన పుస్తకాలు ఇస్తుంటామని ఆయుష్ తల్లిదండ్రులు తెలిపారు.

ఇలా పుస్తకాలు చదవడం పట్ల అమితాసక్తి కలిగిన ఆయుష్ ఒక గంటలో ఇరవై పుస్తకాలు చదివి రికార్డ్ సృష్టించాడు.పీడీఎఫ్ ల కాలం రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితులలో పుస్తకాలపై ఇంత ఆసక్తి కలిగి ఉండటం అభినందించాల్సిన విషయమే అని చెప్పవచ్చు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు