అలా చేస్తే పనిలో సంతృప్తి.. కాజల్ కామెంట్స్ వైరల్..!

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో కాజల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

గతేడాది అక్టోబర్ నెల 30వ తేదీన ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ కు పెళ్లి తరువాత కూడా అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.గతంలో చిరంజీవి కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ నెటిజన్లతో చిట్ చాట్ చేయడంతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానవచ్చారు.ఒక నెటిజన్ కాజల్ ను మీకు ఏ పనిలో సంతృప్తి లభిస్తుందని ప్రశ్నించగా అందుకు కాజల్ కెమెరాలో తన షాట్ ను చూసుకున్న సమయంలో ఆ షాట్ బాగా వచ్చిందని అనిపిస్తే పనిలో సంతృప్తి కలుగుతుందని కాజల్ అన్నారు.

కాజల్ కు పనిపై ఎంత శ్రద్ధోఆమె చెప్పిన సమాధానాన్ని బట్టి అర్థమవుతోంది.మరోవైపు కాజల్ భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేయడంతో పాటు భర్త కంపెనీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు.స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తరువాత కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుండగా కాజల్ కూడా పెళ్లి తరువాత సమంతలా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

గతంలో హీరోయిన్లకు పెళ్లి జరిగితే అవకాశాలు తగ్గుతాయని జోరుగా ప్రచారం జరిగేది.అయితే పలువురు హీరోయిన్లు పెళ్లి తరువాత కూడా వరుస అవకాశాలతో బిజీ అవుతూ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నారు.

కాజల్ నటిస్తున్న ఆచార్య సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు.కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు