వైరల్: గుజరాతి లో మకర సంక్రాంతి పై పద్యం రాసిన మోడీ..!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మకరసంక్రాంతి సంబంధించి గుజరాత్ లో ఓ పద్యాన్ని రాశారు.

ఇందులో భాగంగానే మకర సంక్రాంతి పండుగ రోజున ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని ఆయన అభివర్ణిస్తూ.

ఓ అద్భుతమైన గేయాన్ని రచించారు.అందరికీ సంక్షేమం కోసం నిర్విరామంగా కదిలే సూర్యుడికి నేడు గౌరవ వందనం సమర్పించాలంటూ ఆయన తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ తన మాతృత్వ భాష అయిన గుజరాతి లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఆయన ఈ గేయాన్ని రచించారు.ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ "ఆకాశం" తో తన గేయాన్ని మొదలు పెట్టి, అందులో.

ఆకాశం పండుగ సందర్భంగా మొత్తం చంద్రుడు, సూర్యుడు వెలుగులతో నిండిపోయింది అంటూ రాసుకొచ్చారు.ఆకాశం ఎత్తు కలలు కనే వారు అత్యున్నత లక్ష్యాలు సాధించగలుగుతారని, అదే కొద్దిపాటి కలలు.

Advertisement

ఆశయాలతో పోటీపడేవారు రాళ్లు, గులక రాళ్లలా సమస్యలతో మిగిలిపోతారు అంటూ తెలుపుతూనే.ఆ సూర్యుడు నిరాడంబరంగా, నిర్విరామంగా విశ్వంలోని ఇతరుల క్షేమం కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు అంటూ తెలిపాడు.

ఇందుకోసం ఇవ్వాళ సూర్యుడికి తర్పణం అందించాల్సిన రోజని తాను సూర్యుడి ముందు మోకరిల్లితున్న అంటూ తన నేపథ్యాన్ని కొనసాగించారు.వీటితో పాటు గుజరాతి భాషలో మరికొన్ని పద్యాలు ఆయన రచించారు.

అవి చూడటానికి ఒక బుక్ లా కనబడుతున్నాయి.

భారతదేశంలోని పలు ప్రాంతాలలో సంక్రాంతి ఉత్సవాలు జోరుగా జరుగుతుండడంతో ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలను ఉత్సాహపరుస్తూ ప్రకృతిని ప్రశంసిస్తూ ఈ పద్యాన్ని వ్రాసి తన అధికారిక ట్వీట్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ జరుపుకునే వారికి మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాలలో సంక్రాంతి, మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహూ, పౌచ్ సంక్రాంతి లాంటి వివిధ పేర్లతో పిలుస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు