వైరల్: మంచి నీటికి నమస్కరిస్తున్న మహిళ.. సలాం కొడుతున్న నెటిజన్లు

మనిషి జీవనాధారానికి నీళ్ళు ఎంత ముఖ్యమో మనందరికీ రకరకాలుగా మనకు నిత్యజీవితంలో జరిగిన అనుభవాలను బట్టి మనకు అర్ధమయ్యే ఉంటుంది.

మనం నీటిని చాలా రకాలుగా వృధా చేస్తా ఉంటాం.

ఎందుకంటే మనకు తగినంత నీటి లభ్యత మనకు అందుబాటులో ఉంది కాబట్టి.మనం నీటిని అంతగా సీరియస్ గా తీసుకోము.

కాని కొన్ని కొన్ని గిరిజన గ్రామాలలో అదేవిధంగా అడవుల మీద ఆధారపడి జీవించే వలస కుటుంబాలకు నీటి విలువ తెలిసినంతగా ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చు.ఎందుకంటే వారు జనవాసాలకు దూరంగా వారి నివాసాలు ఉండడం వల్ల వారికి సౌకర్యాలు కల్పించడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

కాని వారు అవేమీ ఆశించకుండా బావి లోతులో ఎక్కడో నీళ్ళు ఉంటే, బావిలోపలికి మెట్ల ద్వారా వెళ్ళి నీటిని నింపుకొని మరల పైకి వస్తారు.ఈ క్రమంలో వేసే అడుగు ప్రాణాలతో చెలగాటమే అని చెప్పవచ్చు.

Advertisement

ఇక అటువంటి పరిస్థితులలో జీవించే వారి దగ్గరికి నల్లా కనెక్షన్ ద్వారా నీళ్ళు వస్తే ఇక వారి స్పందన ఎలా ఉంటుందో ఇక అర్ధం చేసుకోవచ్చు.ఎన్నో ఏళ్లుగా నీటికోసం కష్టపడుతున్న మహిళ ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నీళ్ళు రావడంతో ఎంతో ఆనందంతో నీటికి నమస్కరించింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఆ ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మహిళకు శుభాకాంక్షలు తెలుపుతూ నీటిపై ఆమె ప్రదర్శించిన గౌరవాన్ని చూసి ఆమెకు సలాం కొడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు