లోకేష్ ప‌ర్య‌ట‌న‌కు అచ్చెన్న గైర్హాజ‌ర్‌... చాలా క‌థ న‌డుస్తోందే..!

ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి లోకేష్ ప‌ర్య‌టిస్తున్నారు.

ముఖ్యంగాజ‌గ‌న్ స‌ర్కారును డిఫరెంట్‌గా టార్గెట్ చేయాల‌నే ఉత్సాహంతో ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వారంలో రెండు మూడు రోజులు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు.నిజానికి పార్టీలో ప్రొటోకాల్ ప్ర‌కారం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకోష్ ఎక్క‌డికి వెళ్లినా రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న అచ్చ‌న్నాయుడిని తీసుకువెళ్లాలి.

లేదా ఆయ‌నైనా.ప్రొటోకాల్ ప్ర‌కారం లోకేష్ పాల్గొనే కార్య‌క్ర‌మానికి రావాలి.

అయితేఇక్క‌డ చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు.లోకేష్ పాల్గొనే ఏ ఒక్క కార్య‌క్ర‌మానికీ.

Advertisement

అచ్చెన్న రావ‌డం లేదు.పైగా ఆయ‌న‌కు లోకేష్ ప‌ర్య‌ట‌న స‌మాచా రం కూడా అంద‌డం లేద‌ని అంటున్నారు.

ప్ర‌తి విష‌యాన్ని గోప్యం గా ఉంచుకుని లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని అంటున్నారు.అంతేకాదు.

త మ అనుకూల మీడియాకు ముందుగా త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాలు లీక్ చేస్తున్నారు.దీంతో అచ్చ‌న్న‌కు విష‌యం తెలియ‌డం లేదు.

దీంతో ఆయ‌న లోకేష్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన డం లేదు.దీనికికార‌ణం ఏంటి? క‌మ్యూనికేష‌న్ గ్యాపా.?  లేక ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రుగుతున్న వ్య‌వ‌హా ర ‌మా? అని ఆరాతీస్తే.అచ్చెన్న దూకుడుతో త‌న‌కు ఎప్ప‌టికైనా ఇబ్బందేన‌ని లోకేష్ భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు సీనియ‌ర్లు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ప్ర‌స్తుతం ఈ విష‌యం.చాలా లోపాయికారీగా వినిపిస్తున్నా.వాస్త‌వ‌మేన‌ని చెబుతున్నారు.

Advertisement

నిజానికి అచ్చెన్న వంటి దూకుడును నేత‌ను పార్టీ చీఫ్‌గా ఎంపిక చేయ‌డం కూడా లోకేష్‌కు ఇష్టంలేద‌ని అంటున్నారు.అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తుండ‌డం, గ‌ట్టివాయిస్ వినిపించే బీసీ నాయ‌కుడు మ‌రొక‌రు లేక‌పోవ‌డంతో.

విధిలేక అచ్చెన్న‌కు లోకేష్ ఓటు వేశార‌ని అయితే.ఆయ‌న ఆధిప‌త్యం ఎక్క‌డా క‌నిపించ‌కుండా వినిపించ‌కుండా.

త‌నంత‌ట తానుగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.ఈ క్ర‌మంలోనే త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా గోప్యంగా ఉంచుతున్నార‌ని అంటున్నారు.

కానీ, చిత్రం ఏంటంటే లోకేష్‌కన్నా కూడా అచ్చ‌న్న‌కే యువ‌త‌లో ప్రాధాన్యం పెర‌గ‌డంతోపాటు ఆయ‌న చేసే ప్ర‌క‌ట‌న‌ల‌కే యువత ఫిదా అవుతుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి లోకేష్ ఈ వ్య‌వ‌హారంతో ఇంకెలాంటి వ్యూహం వేస్తారో చూడాలి.

తాజా వార్తలు