వరుస ఛాన్సులతో బిజీ అయిన కలర్ ఫోటో బ్యూటీ!

పదుల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూట్యూబ్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే పేరు, గుర్తింపు సంపాదించుకుంది చాందిని చౌదరి.

రాజ్ తరుణ్ తో కలిసి చేసిన షార్ట్ ఫిలిమ్స్ చాందినికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

నాగశౌర్యకు జోడీగా కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన చాందినికి తొలి సినిమానే ఫ్లాప్ కావడంతో వరుసగా అవకాశాలు రాలేదు.పటాస్, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలలో ఆఫర్లు వచ్చినా ఒక ప్రముఖ నిర్మాతకు రెండేళ్ల పాటు వేరే సినిమాల్లో నటించనని అగ్రిమెంట్ ఇవ్వడంతో చాందిని హిట్ సినిమాల్లో నటించే ఛాన్స్ కోల్పోయింది.

అయితే సరైన సక్సెస్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న చాందిని చౌదరికి కలర్ ఫోటో రూపంలో ఎట్టకేలకు భారీ సక్సెస్ ఖాతాలో చేరింది.ఈ సినిమాలో చాందిని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

కలర్ ఫోటో సినిమా విడుదలయ్యే వరకు సరైన అవకాశాలు రాక కెరీర్ విషయంలో ఇబ్బంది పడిన చాందినికి ప్రస్తుతం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.యూట్యూబ్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చాందిని మరో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంటే మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని చెప్పవచ్చు.

Advertisement

ప్రస్తుతం చాందిని చౌదరి చేతిలో రెండు ఆఫర్లు ఉన్నాయి.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సూపర్ ఓవర్ అనే సినిమాలో, విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ గామి సినిమాలో చాందిని హీరోయిన్ గా ఎంపికైంది.స్వయంగా చాందినినే ఈ సినిమాల్లో తను ఎంపికైనట్టు వెల్లడించింది.స్టార్ హీరోలు చాందిని చౌదరికి ఛాన్సులు ఇస్తే మాత్రం ఆమె దశ తిరిగినట్టే అని చెప్పవచ్చు.

కథల, పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తే చాందిని మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు