దయచేసి నా ఫోటోలను తొలగించండి అంటున్న నటి..!

అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన "దంగల్" సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జైరా వసీం ఇప్పటి వరకు మూణ్నాలుగు సినిమాల్లో నటించి బాగా క్రేజ్ సంపాదించారు.

దంగల్ సినిమా భారీ హిట్ కావడంతో ఇండియా తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల నుండి కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది.

సోషల్ మీడియా వేదికగా ఆమెకు కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ కూడా పుట్టుకొచ్చారు.ఫ్యాన్ పేజీలు, గ్రూపులు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమెను ఆరాధించే వారు ఎంతోమంది ఇంటర్నెట్ వేదికగా ఆమె ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు.

అయితే జైరా వసీం తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక రిక్వెస్ట్ చేశారు.తాను తన జీవితంలో మరొక అంకానికి శ్రీకారం చుట్టబోతున్నానని.

అందుకే తన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో లేకుండా, అసలు కనిపించకుండా డిలీట్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.అయితే గతంలో ఆమె సినిమా పరిశ్రమ నుండి దూరం కాబోతుందని ప్రకటించారు.

Advertisement

సినిమాల్లో నటించడానికి తన మతం అడ్డు వస్తుందని.తమ మతానికి గౌరవం ఇచ్చి నటీమణి జీవితానికి స్వస్తి చెబుతున్నానని చెప్పుకొచ్చారు.

మళ్లీ ఈ రోజున మరొక పోస్ట్ పెట్టి తన ఫోటోలను, వీడియోలను డిలీట్ చేసి తాను ఒక నటీమణీ అనే ముద్రను తొలగించాల్సిందిగా కోరారు.

ఆమె ఏమన్నారంటే."నాపై ఇప్పటికీ ప్రేమకురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.నేను నటిగా కొనసాగినన్ని రోజులు సపోర్ట్ చేసి నేను నటించిన సినిమాలను ఆరాధించారు.

ఇప్పటివరకు మీరు చూపించిన ప్రేమకు ధన్యురాలని అయిన నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అడగాలనుకుంటున్నాను.అది ఏంటంటే మీ సోషల్ మీడియా నుండి నా ఫోటోలను, వీడియోలను డిలీట్ చేయండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇంటర్నెట్ నుండి ఫోటోలన్ని డిలీట్ చేయడం అసాధ్యం కానీ ఫ్యాన్ పేజీల నిర్వాహకులు నా ఫోటోలను షేర్ చేయడం నిలిపివేయండి.అలాగే పేజీలను డిలీట్ చేసేయండి.ఎవరూ కూడా నా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోకండి.

Advertisement

దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి", అని పోస్ట్ చేశారు.

తాజా వార్తలు