కరోనా ఎఫెక్ట్ : సింగపూర్ లో భారతీయుడిపై కేసు నమోదు..!!!

కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది మృతి చెందినా, కోట్లాది మంది ఈ మహమ్మారి బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఇప్పటికి చాలామంది ప్రజలు కరోనా పై నిర్లక్ష్య వైఖరిని అవలభించడం ఎంతో దారుణమైన విషయం.

ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు మాస్కులు కట్టుకుని బయటకి వెళ్ళమని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు పలు విధాలుగా ప్రకటనలు ఇస్తూనే ఉంటున్నా చాలామంది నిర్లక్ష్యం ఎంతో మందిని బలి తీసుకుంటోంది.

అందుకే ప్రభుత్వాలు భాద్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కటినమైన చర్యలు చేపడుతున్నాయి.ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వం కరోనా విషయంలో అశ్రద్ద వహించిన భారతీయు యువకుడిని అరెస్ట్ చేసింది.

కరోనా వచ్చిన తరువాత అక్కడి ప్రభుత్వం విధించిన నిభంధనల ప్రకారం అతడికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే.

భారత్ కు చెందిన 25 ఏళ్ళ బాలచంద్రన్ అనే యువకుడు స్థానికంగా ఉద్యోగం చేస్తున్నాడు.తనకు కరోనా సోకిందనే అనుమానంతో అక్కడి హాస్పటల్ లో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.అయితే

Advertisement

ఫలితాలు వెల్లడి కాకముందే అతడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా నిభందనలు అతిక్రమిస్తూ పబ్లిక్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీ కార్లలో తిరగడంతో చేశాడు.అంతేకాదు విదేశీ ఉద్యోగులు ఉంటున్న వాటిని కోవిడ్ ఐసోలేషణ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించి అక్కడి నుంచీ ఎవరిని బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం అయితే ఈ ఆదేశాలు భేఖాతరు చేసిన బాలచంద్రన్ నిభందనలకు విరుద్దంగా స్వదేశానికి రావడానికి ప్రయత్నించడంతో సింగపూర్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.నేరం రుజువైతే సుమారు 10వేల సింగపూర్ డాలర్ల జరిమానా, లేదంటే 6 నెలలు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు