పొట్లకాయ తినేముందు ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి?

పొట్ల‌కాయ‌.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పొడ‌వుగా ఉండే ఈ పొట్ల‌కాయను కొంద‌రు ఇష్ట‌ప‌డితే.

కొంద‌రు మాత్రం ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌రు.

కానీ, పొట్ల‌కాయ అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.త‌ప్ప‌కుండా దాన్ని డైట్‌లో చేర్చుకుంటారు.

ఎందుకంటే, పొట్ల‌కాయ‌లో ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.అవి మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంతో పాటు.

Advertisement

అనేక జ‌బ్బుల‌ను కూడా నివారిస్తాయి.మ‌రి పొట్ల‌కాయ తినేముందు.

దాని వ‌ల్ల మ‌న‌కు ల‌భించే హెల్త్ బెనిఫిట్స్ ఏంటీ అన్న‌ది ఓ లుక్కేసేయండి.అధిక బ‌రువును నియంత్రించ‌డంలో పొట్ల‌కాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

పొట్ల‌కాయలో బ‌రువును పెంచే కేల‌రీలు, కొవ్వు ప‌దార్థాలు చాలా త‌క్కువ ఉంటాయి.అలాగే పొట్ల‌కాయ తీసుకోవ‌డం ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌ల‌గ‌డంతో.

వేరే ఆహారం తీసుకోలేరు.ఫలితం బ‌రువు త‌గ్గొచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాగే శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న విష ప‌దార్థాల‌ను, వ్యర్దాలను బ‌య‌ట‌కు పంపి.మూత్ర‌పిండాల ప‌ని తీరును మెరుగుప‌రిచే శ‌క్తి పొట్ల‌కాయ‌కు ఉంది.

Advertisement

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న వారు పొట్ల‌కాయ తీసుకుంటే చాలా మంచిది.ఎందుకంటే, పొట్ల‌కాయ‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.అది మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంతో పాటు జీర్ణ శ‌క్తిని పెంచుతుంది.

అలాగే పొట్ల‌కాయ‌లో ఉండే మెగ్నీషియం.అధిక ర‌క్త‌పోటును అదుపులోకి తెస్తుంది.

మ‌రియు ఇందులో ఉండే కాల్షియం ఎముకుల‌ను, దంతాల‌ను బ‌ల‌ప‌రుస్తుంది.జ్వ‌రంతో బాధ ప‌డుతున్న వారు పొట్ల‌కాయ‌తో త‌యారు చేసిన డికాష‌న్ తాగితే.

మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే పొట్ల‌కాయ తిన‌డం వ‌ల్ల గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక మ‌ధుమేహం ఉన్న వారు కూడా పొట్ల‌కాయ‌ను తీసుకోవ‌చ్చు.ఫ‌లితంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

చ‌ర్మ ఆరోగ్యానికి కూడా పొట్ల‌కాయ ఎంతో మేలు చేస్తుంది.

తాజా వార్తలు