ఒక్కటైన అభిజిత్‌, అఖిల్‌.. తీవ్రంగా మండిప‌డ్డ అవినాష్‌?

బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ నాగార్జున హోస్ట్ ఇటీవల ప్రారంభ‌మై.ఏడో వారినికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ వారం నోయ‌ల్‌, అభిజిత్‌, అవినాష్‌, అరియానా, మోనాల్‌, దివిలు నామినేష‌న్‌లో ఉండ‌గా.వీరిలో ఒక‌రు దుకాణం స‌ద్దేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.నిన్న‌టి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు సినిమా తీయాల‌ని టాస్క్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఇంటి స‌భ్యుల‌కు కొన్ని పాత్ర‌లు కూడా కేటాయించారు.అభిజిత్ డైరెక్ట‌ర్‌గా, దివి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా‌, లాస్య‌ మేక‌ప్ అండ్ స్టైలిష్‌గా, అవినాష్ స్క్రిప్ట్ రైట‌ర్‌గా, నోయ‌ల్ డీఓపీగా, హారిక మ‌రియు సోహైల్ ఐట‌మ్ సాంగ్ డ్యాన్స‌ర్లుగా బిగ్ బాస్ నిర్ణ‌యించారు.

Advertisement

ఇక టాస్క్ ప్రారంభం అవ్వ‌గానే ఎవ‌రి పాత్ర‌లో వారు లీన‌మైపోయారు. ప్రేమ మొదలైంది సినిమాలో అఖిల్‌ మరియు మోనాల్‌ లు హీరో హీరోయిన్‌ గా నటించారు.

వీరి రొమాంటిక్‌ సీన్స్ డైరెక్ట్ చేస్తూ అభి చేసిన కామెడీ హైలైట్ అయింది.అయితే ఈ క్ర‌మంలోనే డైలాగుల విష‌యంలో అవినాష్‌కి, అభిజిత్‌కి గొడ‌వ‌లు వ‌చ్చాయి.

స్క్రిప్ట్ రైట‌ర్‌గా తాను డైలాగులు చెప్పినా తీసుకోవ‌డం లేద‌ని అవినాష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.కానీ, ఈ విష‌యంలో అనూహ్యంగా అభిజిత్‌కు అఖిల్ స‌పోర్ట్ చేశాడు.

వాస్త‌వానికి వీరిద్ద‌రికీ మొద‌ట నుంచి ప‌డ‌దు.ఇందుకు కార‌ణం మోనాల్.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆమె కార‌ణంగా ఒకానొక సంద‌ర్భంలో కొట్టుకోవ‌డానికి కూడా సిద్ద‌ప‌డ్డారు.అయితే నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం అభిజిత్‌కు అఖిల్ స‌పోర్ట్ చేయ‌డం ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది.

Advertisement

మ‌రోవైపు అవినాష్ చివర్లో ఓ సీన్‌లో డైలాగ్ చెప్పబోతుంటే.మ‌ధ్య‌లో లాస్య టచప్‌లు చేస్తూ, దివి అందరినీ డిస్ట్రబ్‌ చేస్తూ కామెడీ చేశారు.

దీన్ని అంద‌రూ ఈజీగానే తీసుకున్నా.అవినాష్ మాత్రం సీరియ‌స్‌గా తీసుకున్నాడు.

దీనిపై మాట్లాడుతూ.తనను కావాల‌నే ఆడుకుంటున్నారని అవినాష్‌ నోయెల్ వ‌ద్ద వాపోయారు.

నామినేషన్స్‌లో అన్నీ చూపిస్తానంటూ మండిప‌డ్డారు.చివ‌ర‌కు ఎలాగోలా సినిమాను పూర్తి చేశారు.

తాజా వార్తలు