పెళ్లి వేడుకల్లో కూడా బ్యాట్ చేతపట్టి ఫోటోలకు పోజులిచ్చిన మహిళ క్రికెటర్..!

మన భారతదేశంలో క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారతదేశంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునే విషయాలలో రాజకీయాలు సినిమాలు ఆ తర్వాత క్రికెట్.

అంతలా భారత దేశ ప్రజలలో క్రికెట్ ఇమిడిపోయింది.క్రికెట్ చూసేవారికి అంత అభిమానం ఉంటే మరి ప్రపంచ స్థాయిలో క్రికెట్ ఆడుతున్న వారి గురించి చెప్పనక్కర్లేదు.

అయితే క్రికెట్ కేవలం భారత్ లోనే కాదు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో కూడా ఎక్కువగా అభిమానిస్తారు.అయితే తాజాగా ఓ మహిళా క్రికెటర్ క్రికెట్ తప్ప వేరే ప్రపంచం తెలియని ఆవిడ తన పెళ్లి వేడుకల్లో కూడా బ్యాట్ పట్టింది.

ఆవిడ తన పెళ్లి దుస్తులలో బ్యాట్ పట్టి ఫోటోలకు ఫోజ్ ఇస్తూ అందరిని ఆకర్షించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

Advertisement

బంగ్లాదేశ్ మహిళా జట్టు ప్లేయర్ సంచితా ఇస్లాం.ఈవిడ అ తన పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ జరగగా అందులో భాగంగానే ఆవిడ బ్యాట్ పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

దీంతో ఆమెకు క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పినట్లయింది.ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఓ స్పోర్ట్స్ మీడియా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

కేవలం క్రీడా అభిమానులకు మాత్రమే కాకుండా మిగతా వారిని కూడా అమితంగా ఆ ఫోటోలు ఆకర్షించాయి.దీంతో ఆ ఫోటో లకు వేల కొద్ది లైకులు, షేర్స్ లభిస్తున్నాయి.2014 సంవత్సరంలో సంచితా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టింది.ఇప్పటివరకు ఆవిడ 14 వన్డేలు 32 టి20 మ్యాచ్ లు బంగ్లాదేశ్ టీం తరఫున ఆడింది.2008లో మొట్టమొదటిసారి ఆసియా కప్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళల జట్టు లో ఈవిడ కూడా ఓ సభ్యురాలు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు