నిరుపేదల కోసం జార్ఖండ్ సీఎం సంచలన నిర్ణయం!

కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో కోత్త పథకాలను అమలు చేస్తున్నాయి.

పేదల స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి.

అయితే తాజాగా జార్ఖండ్ సీఎం కేంద్రం, ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలకు భిన్నంగా పేదలకు మేలు జరిగేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు.సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కేవలం 10 రూపాయలకే నిరుపేదలకు ధోతి, చీర అందించే స్కీమ్ ను అమలు చేస్తున్నారు.సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.

కేబినేట్ భేటీలో మంత్రులతో ఈ పథకం గురించి చర్చించి సీఎం ఈ పథకానికి ఆమోదం తెలిపారు.రోజురోజుకు వస్త్రాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేదలకు తక్కువ ధరకే ధోతీ, చీర అందించేలా నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ఏడాది కాలంలో రెండుసార్లు ఈ స్కీమ్ ద్వారా పేదలు 10 రూపాయలు చెల్లించి ధోతి లేదా చీరను కొనుగోలు చేయవచ్చు.పురుషులు ధోతి కొనుగోలు చేయడం ఇష్టం లేకపొతే అంతే మొత్తం చెల్లించి లుంగీ కొనుక్కోవచ్చు.

సీఎం కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం ఆరు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ ద్వారా పేదలకు ధోతి లేదా చీర అందజేయనున్నారు.అంత్యోదయ అన్నా యోజన స్కీమ్ అర్హులు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హులు ప్రభుత్వం అమలు చేసే కొత్త స్కీమ్ కు అర్హులు.

ఎన్నికలకు ముందు హేమంత్ సోరెన్ అధికారంలోకి వస్తే పేదలకు చీర, ధోతి ఇస్తానని చెప్పగా ప్రస్తుతం ఆ హామీని నిలబెట్టుకున్నారు.జార్ఖండ్ లో అమలవుతున్న ఈ పథకం కనుక పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉంటాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు