తెలంగాణలోని ఇందూరు పాలిటిక్స్‌లో మిస్టర్ కూల్ నేతగా పేరున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారన్న గుసగుసలు ఇందూరు పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.గత లోక్‌సభ ఎన్నికలకు ముందు కవిత వ్యతిరేకత ఎదుర్కోవడంతో సీఎం కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావుతో పాటు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.
అయితే ఆ ఎన్నికల్లో కవిత ఓడిపోయింది.పైగా కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి మరీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కారెక్కిన మండవకు కేసీఆర్ ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది.మండవ తనకు ఎమ్మెల్సీ వద్దని చెప్పడంతో జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆ రాజ్యసభ పదవిని మండవకు ఇస్తారన్న ప్రచారం జరిగింది.
అయితే డీ శ్రీనివాస్ టీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభకు మాత్రం రాజీనామా చేయడం లేదు.పార్టీ కూడా ఆయనను సస్పెండ్ చేయడం లేదు.దీంతో డీఎస్ ఎలాగూ ఆరేళ్ల పాటు ఆ పదవిలోనే కొనసాగుతారన్నది క్లారిటీ వచ్చింది.
అయితే మండవ ఎప్పుడూ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు.
గులాబీ గూటికి చేరి యేడాదిన్నర అవుతున్నా ఆయనకు కేసీఆర్ ఏ పదవి ఇవ్వకపోవడంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.ఇదే అంశంపై మండవ సైతం తను అచరుల దగ్గర ఆవేదనతో ఉన్నారట.
అయితే మండవ అనుచరగణం మాత్రం ఆయన్ను కారు దిగి బీజేపీలోకి వెళ్లాలని సూచిస్తోందట.
సమైక్య రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన జిల్లా రాజకీయాల్లో మంచి నేతగా పార్టీలకు అతీతంగా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు కేసీఆర్ స్వయంగా ఆయనను పార్టీలోకి తీసుకున్నా తనతో పాటే వచ్చిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి రాజ్యసభ ఇచ్చి మండవను పక్కన పెట్టడంపై కేసీఆర్ అంతరంగం ఏంటో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు.మరి మండవ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.