సీఎంగా, ప్రధానిగా నరేంద్ర మోడీ 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.నిజానికి ఈ దేశంలో ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి.
దేశానికి ముఖ్యమంత్రి అయి.ఇంత కాలం నెట్టుకురావడం అసాధ్యం.పైగా గాంధీల కుటుంబాన్ని జాతీయ స్థాయిలో నిలువరించడం.ఆర్ ఎస్ ఎస్ కనుసన్నల్లో మెలిగే.బీజేపీ వంటి పార్టీలో ఏకైక నాయకుడిగా రెండు సార్లు ప్రధాని పీఠం అధిరోహించడం అనేది అంత ఈజీకాదు.ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ప్రధానిగా నరేంద్రమోడీ.
ఆయన రాజకీయ ఎంట్రీనే చిత్రం.ఇక, సీఎంగా ఆయన గుజరాతీలను మెప్పించిన విధానం.కేంద్రంలో ప్రధానిగా ఎలివేట్ కావడం అంతా ఈజీగా సాగిన పరిణామం కానేకాదు.
2001, అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ.ప్రమాణ స్వీకారం చేశారు.మరి ముహూర్త బలమో.లేక.ఆయన దీక్షాదక్షలతో లేదా రెండూ కలిసి వచ్చాయో తెలియదుకానీ.
నేటి వరకు ఆయన మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటే.ప్రధానిగా రెండో దఫా కూడా సాగుతున్నారు.
ఇంత సుదీర్ఘ కాలం గుజరాత్‌కు చెందిన ఓ నాయకుడు అధికారంలో కొనసాగడం కూడా ఇదే తొలిసారి కావడం రికార్డ్.అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశూబాయ్ పటేల్.
సర్కారుపై అవినీతి ఆరోపణలు రావడం, అప్పట్లో జరిగిన ఆరు స్థానాల ఉప పోరులో బీజేపీ ఘోరంగా పరాజయం కావడంతో బీజేపీ పెద్దలు ఆయనను పక్కన కూర్చోబెట్టాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ముందుకు వచ్చిన మోడీకి అనేక వ్యతిరేకతలు వచ్చాయి.
ముఖ్యంగా ఎల్ కే అద్వానీ వంటి వారు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.కానీ, అటల్ బిహారీ వాజపేయి సహా మరికొందరు మోడీని బలపరిచారు.
వాస్తవానికి ఆయన అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు.అయినప్పటికీ.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తర్వాత 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.ఇక, అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.
ప్రదానంగా గుజరాతీల మనసు దోచుకునే క్రమంలోను, అంతర్జాతీయంగా పర్యావరణ నిబంధనలను అమలు చేయడంలోను మోడీ ముందున్నారు.
ఈ క్రమంలో గుజరాత్ ను ఆయన సౌర విద్యుత్‌కు కేంద్రంగా మార్చారు.
అదేసమయంలో ఐటీ హబ్‌గా కూడా తీర్చిదిద్దారు.ఇంటింటికీ వంటగ్యాస్ సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజల మనసు దోచుకున్నారు.
ఇలా.ఆయన అడుగులు ఢిల్లీ వైపు పడ్డాయి.ఇక్కడ కూడా ప్రధాని పీఠం విషయంలో ప్రధానంగా అద్వానీ వైపు అందరి వేళ్లూ చూపించినా.మోడీ పైచేయి సాధించడంలో ఆయన వాక్చాతుర్యం, రాష్ట్రాలను ఏకం చేయడం, ముఖ్యంగా మిత్రపక్షాలను మైమరపించే వ్యూహం అమలు చేయడం వంటివి కలిసి వచ్చాయి.
2014లో వాస్తవానికి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని .ఏ పార్టీ కూడా ఏకపక్షంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని విశ్లేషణలు వచ్చాయి.కానీ, వీటిని అధిగమించిన మోడీ.బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే మెజారిటీ సాధించారు.అయినా.మిత్రపక్షాలతోకూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనం.ఇక, గత ఏడాది ఎన్నికల్లోనూ ఆయన మిత్రపక్షాలతో కలిసే ఎన్నికలకు వెళ్లినా.2014ను మించిన మెజారిటీ బీజేపీ సాధించేలా వ్యూహం పన్నారు.సక్సెస్ అయింది.ఇక, ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ వంటి కీలక పథకం ప్రవేశ పెట్టి ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నారు.
దాయాది దేశం పాకిస్థాన్‌ను కట్టడి చేయడంలోను, అమెరికాతో సంబంధాలను మెరుగు పరుచుకోవడంలోను ముందున్నారు.ఇక, ఇటీవల ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై గతంలో ఏ ప్రధానీ విజృంభించని రీతిలో మోడీ నిప్పులు చెరిగారు.
ఎన్నాళ్లు ఇవ్వరో చూస్తాం! అంటూ సవాల్ రువ్వి.భారత పరాక్రమాన్ని వినువీధులకు ఎగబాకేలా చేశారు.
అదేసమయంలో మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న కొన్ని వ్యతిరేకతలను కూడా వ్యూహాత్మకంగా ఎదురొడ్డుతున్నారు.అందుకే ఆయన సాధించిన రికార్డులను బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు.