ఎన్నికలపై జగన్ ఎత్తులు ! మామూలుగా లేవు ?

గత కొంతకాలంగా ఏపీలో రాజకీయాలు ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి.

ఆ ఎన్నికల కేంద్రంగానే అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా పట్టు సంపాదించి సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి.

ముఖ్యంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉండడంతో ఆ ఎన్నికల్లో విజయం సాధించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని అన్ని పార్టీలు డిసైడ్ అయ్యాయి.ఈ క్రమంలోనే ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు మార్చిలోపు నిర్వహించి తాను రిటైర్ అవ్వాలని ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నించారు.కానీ ఆయన టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని,  ఆయన హయాంలో ఎన్నికలకు వెళితే వైసిపికి పూర్తిగా ఎదురు దెబ్బలు తగులుతాయి అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉండడం ఎట్టిపరస్థితుల్లోను ఎన్నికలు నిర్వహించాలి అనే పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, దీనిపై కోర్టు వరకు వివాదం వెళ్లడం వంటి పరిణామాలు జరిగాయి.

ఇదిలా ఉంటే మార్చి లో ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవి విరమణ చేయబోతున్నారు.ఆయన స్థానంలో కొత్తగా మరోకరిని నియమించి ఆయన హయాంలో ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Advertisement

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను మూడు రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కలిసి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ను నిర్వహించాలని ఆదేశించింది.కానీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో స్పెషలాఫీసర్ ల పాలనను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అప్పటిలోగా తిరుపతి ఎక్కువ ఎన్నికలు కూడా పూర్తవుతాయని, ఆ ఎన్నికల్లో తప్పనిసరిగా వైసీపీని గెలుస్తుందనే నమ్మకం జగన్ లో ఉండడం, ఆ విజయంతో వచ్చిన ఉత్సాహంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు వస్తాయని ఉద్దేశంతో జగన్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.అలాగే సంక్షేమ పథకాలను అప్పటిలోగా అమలు చేసి చూపించి ప్రజల్లో మరింత పట్టు పెంచుకోవాలనే ఉద్దేశంలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ కి దక్కే విధంగా జగన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు