ఆ పుకార్లకు చెక్‌ పెట్టిన స్టార్‌ హీరో చిత్ర యూనిట్‌

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సూరరై పోట్రు సినిమాను తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో డబ్బింగ్ చేసి తమిళం మరియు తెలుగులో ఒకేసారి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.సమ్మర్ లోనే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా సినిమాను ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

 Akashame Nee Haddura Movie Releasing In Amazon Only , Akashame Nee Haddura,suri-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ఫామ్ అయినా అమెజాన్ ప్రైమ్‌ ద్వారా విడుదల చేయబోతున్నట్లు గా మేకర్స్ ప్రకటించారు.వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాల్సి ఉంది.

ఈ లోపు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసి థియేటర్ల అన్‌ లాక్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.థియేటర్లను ఈ నెల 15 వ తారీకు నుండి ఓపెన్ చేసుకునేందుకు గాను అనుమతులు ఇవ్వడంతో అంతా కూడా అందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీకి వెళ్ళాలనుకున్నా థియేటర్ల రీ ఓపెన్ కారణంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు గా తెలుస్తోంది.ఇదే సమయంలో ఆకాశమే నీ హద్దురా సినిమాను కూడా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని.

ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ వారితో చేసుకున్న ఒప్పందంను రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.కానీ ఆ వార్తలు నిజం కాదని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

తమ సినిమాను ముందు నుంచి చెబుతున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాము అంటూ యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.అమెజాన్ ప్రైమ్‌ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్‌ చేయాలని తాము భావిస్తున్నట్లు గా పేర్కొన్నారు.

ఈ సినిమాకు తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube