ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు!

ప్రముఖ యాప్ పేటీఎం ను తాజాగా గూగుల్, ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేసే యాప్స్ ను తాము ఎంకరేజ్ చేయలేమని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గూగుల్ తమ బ్లాగ్ లో పేర్కొంది.

యూసర్ సేఫ్టీ ని దృష్టిలో ఉంచుకొని తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని గూగుల్ అభిప్రాయపడింది.ఇక ఇండియాలో పేటీఎం యాప్ ను చాలామంది వినియోగిస్తున్నారు.

దానితో తాజాగా గూగుల్ తీసుకున్న నిర్ణయంతో పేటీఎం యూస్ చేసే యూజర్స్ అయోమయంలో పడ్డారు.ఇక వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఈ విషయంపై పేటీఎం స్పందించింది.

యూజర్స్ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారి సొమ్ము జాగ్రతగా ఉందని ప్రస్తుత పరిస్థితిలో పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ ను అప్డేట్ చేయడానికి కుదరదు కాని ట్రాన్సాక్షన్స్ యధావిధిగా చేసుకోవచ్చని చెప్పింది.ప్రస్తుతం ప్లే స్టోర్ లో పేటీఎం కు సంబంధించిన పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఇక గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయంపై పేటీఎం ఎలా స్పందిస్తుందో?తమ వాలెట్ ను తిరిగి ప్లే స్టోర్ లోకి తీసుకొస్తుందా అన్న అంశాల పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు