ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన వారు ఎవరో తెలుసా...?

ఐపీఎల్ 2020 సీజన్ అసలు మొదలవుతుందో లేదో అన్న పరిస్థితి నుండి ఎలాగో లాగా ఈ నెల 19 నుండి యూఏఈ దేశంలో పూర్తి ఐపీఎల్ నిర్వహించబోతోంది బీసీసీఐ.

ఇందుకు సంబంధించి ప్రతి టీం జట్టు సభ్యులు వారి యాజమాన్యంతో కలిసి యూఏఈ కి చేరుకొని అక్కడ క్వారంటైన్ కూడా ముగించుకున్నారు.

ఆపై ప్రతి జట్టు సభ్యులందరూ కూడా తీవ్ర స్థాయిలో టోర్నీకి ప్రాక్టీసు మొదలు పెట్టారు కూడా.ఆటగాళ్లందరూ పూర్తి బయో సెక్యూలర్ వాతావరణం లో వారి ప్రాక్టీస్ ను సాధన చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే. ఐపీఎల్ అంటేనే ఎక్కువగా బ్యాట్స్మెన్ హవా కొనసాగుతోంది.అయితే ఇది వరకు ఎవరు ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నారో అన్న సంగతి మీకు తెలుసా.? అయితే ఇది వరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న వారిలో మొత్తం 129 మంది ఆటగాళ్లు ఉన్నారు.అయితే ఇందులో అత్యధికంగా అవార్డులు గెలుచుకున్న మొదటి ఐదు మంది ఆటగాళ్లు ఎవరో తెలుసా.? లేకపోతే.ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లను గెలుచుకున్న ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు.ఈయన 125 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి అందులో 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.ఇక రెండో స్థానంలో రాయల్ చాలెంజర్స్ ఆటగాడు డివిలియర్స్ 20 సార్లు అవార్డును గెలుచుకున్నాడు.

Advertisement

ఈయన మొత్తం 142 ఐపీఎల్ ఇన్నింగ్స్ లో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఇక మూడో స్థానంలో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు.

ఈయన ఇప్పటివరకు 126 ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు.ఇక 4వ స్థానంలో డేవిడ్ వార్నర్ లాగే 17 సార్లు టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోని 17 సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు ను అందుకున్నారు.

అయితే ఇందుకు ధోని 170 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.ఇక 5 వ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లను గెలుచుకున్నాడు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు