కరోనాతో వృద్ధుడి మృతి.. ముస్లిం యువతే !

కరోనా కారణంగా బంధాలు, బంధుత్వాలు మంట గలిశాయి.మానవత్వాన్ని మరిచారు.

కరోనా వచ్చిందంటే చాలు కన్న కొడుకులే ఇంటి నుంచి గెంటేస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం.

ఇక కరోనా వల్ల చనిపోయారంటే ఆ వైపు చూడటానికి కూడా ఇష్ట పడటం లేదు.

అంతలా వారికి కరోనా ప్రాణ భయం పట్టుకుంది.అయితే కరోనా ఉన్న వృద్ధుడికి ముస్లిం యువకులు అంత్యక్రియలు జరిపారు.

కరోనా ఉన్నా పర మతానికి చెందిన వృద్ధుడికి అంత్యక్రియ జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

స్థానిక ఎన్జీవో కాలనీకి చెందిన ఓ వృద్ధుడికి కరోనా సోకింది.ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

వైద్యులు మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినా అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు.రక్త సంబంధం ఉన్న వాళ్లే దూరం పెట్టారు.

దీంతో ఆ వృద్ధుడి శవం అనాథ శవంలా మారింది.ఈ విషయం స్థానిక ముస్లిం యువకులకు తెలియడంతో కరోనా ఉందని తెలిసినా వెనుకడుగు వేయలేదు.

వృద్ధుడి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ విషయం పలువురికి తెలియడంతో ఆ ముస్లిం యువకులను ప్రశంసించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కులాన్ని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటారని మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు