సూర్య ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా

కోలీవుడ్ లో ఫస్ట్ ఒటీటీ రిలీజ్ కి రెడీ అయిన హీరో సూర్య.నిర్మాతగా కూడా తాను చేసిన సినిమాని ఒటీటీలోనే రిలీజ్ చేశాడు.

ఆ సమయంలో తనపై విమర్శలు చేసిన వారికి సూర్య కాస్తా గట్టిగానే సమాధానం చెప్పారు.నిర్మాతగా ఆ సినిమా మీద చాలా డబ్బులు పెట్టానని, ఇప్పుడు థియేటర్ లో తన సినిమా రీలీజ్ చేయాలని అడుగుతున్న వారు నష్టపోతే నా డబ్బులు వెనక్కి ఇస్తారా అంటూ ప్రశ్నించాడు.

అయితే అప్పటి నుంచి తమిళ థియేటర్ యాజమాన్యాలు సూర్య మీద వ్యతిరేకంగా ఉన్నాయి.ఇప్పుడు తాను హీరోగా చేసిన ఆకాశం నీ హద్దురా సినిమాని కూడా ఒటీటీలోనే రిలీజ్ చేస్తున్నాడు.

అయితే సూర్య సినిమాలు అంటే థియేటర్ యజమానులకి కొంత వరకు లాభాలు ఉంటాయి.అయితే ఈ సినిమాని కూడా ఒటీటీలో రిలీజ్ చేయడం వలన సూర్య తమ మార్కెట్ ని దెబ్బ తీస్తున్నాడని చాలా మంది భావిస్తున్నారు.

Advertisement

దీనికి రాజకీయ రంగు పులిమేసి అతనిని టార్గెట్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో థియేటర్ యాజమాన్యాల తీరుపై ప్రముఖ నిర్మాత భారతీరాజా తీవ్ర విమర్శలు చేశారు.

కావాలనే కొందరు సూర్యను టార్గెట్ చేస్తున్నారని భారతీరాజా ఆరోపించారు.దీని వెనుక రాజకీయ నాయకుల ప్రోద్బలం కూడా ఉందని అన్నారు.

థియేటర్స్ లో సినిమాలు ఆడేటప్పుడు టికెట్ దగ్గర్నుంచి పార్కింగ్, పాప్ కార్న్ వరకు పెద్ద దోపిడీ జరిగిందని, అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని చెప్పారు.పెద్ద హీరోల సినిమాల కోసం తక్కువ బడ్జెట్ సినిమాలకు థియేటర్లను ఇవ్వనప్పుడు కూడా ఎవరూ అడగలేదని మండిపడ్డారు.

ఇప్పుడు సూర్య ఓటీటీలో సినిమాను విడుదల చేస్తున్నాడని తెలియగానే, థియేటర్లు నష్టపోతాయని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని భారతీరాజా అన్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

ఈ తరుణంలో సూర్య తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.ఓటీటీలో విడుదల అనేది మొత్తం సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్య అని, దీన్ని ఒక వ్యక్తి సమస్యగా చూడకూడదని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు