అక్కడ ఖైదీలకు ఎలాంటి ఆహారం పెడుతున్నారో తెలిస్తే?

కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారాన్నే తీసుకుంటున్నారు.బయటకు వచ్చినప్పుడు మాస్కు, శానిటైజర్ ఉపయోగించి ఆరోగ్యంగా ఉంటున్నారు.

ఇంకా ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని జైలులో ఖైదీలందరికి కూడా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని పెడుతున్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తున్నారు.కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ జైలు అధికారులు వారికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇస్తున్నట్టు తెలిపారు.

కాగా మే 13న ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆతర్వాత జూన్ 15న మాండొలి జైలుకు చెందిన ఇద్దరికి కరోనా వచ్చి జులై 4న మరణించినట్టు తెలిపారు.కరోనా కారణంగా ఇప్పటికే 4వేలమంది ఖైదీలను వివిధ కారణాలతో విడుదల చేసినట్టు, 1,100 మంది దోషులను అత్యవసర పేరోల్ పై విడుదల చెయ్యగా 2,900 మందిని మధ్యంతర బెయిల్ పై విడుదల చేసినట్టు తెలిపారు.

Advertisement

ప్రస్తుతం ఢిల్లీ జైళ్లలో 14,600 మంది ఖైదీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.అంతేకాదు ఖైదీలకు హోమియో మందులను, బలాన్ని ఇచ్చే ఆహారాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే పండ్లను, నిమ్మరసాన్ని రోజు ఇస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు