హీరో మృతి కేసులో నేడు కీలక పరిణామం, ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ మృతి కేసు విషయంలో సుప్రీం కోర్టు నిన్న కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.

ముంబయి పోలీసులు వ్యతిరేకిస్తున్నా కూడా సుప్రీం కోర్టు మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ ఆదేశించింది.

ముంబయి పోలీసులు తామే ఈ కేసు విచారణ చేస్తామని తమ పోలీసు వ్యవస్థపై జనాల్లో అనుమానాలు కలిగించేలా ప్రవర్తించవద్దంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.కాని సుప్రీం కోర్టు మాత్రం కేసును సీబీఐకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసు అప్పగిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఇందుకోసం ఒక టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.ఆ టీమ్‌ ను సీబీఐ జేడీ లీడ్‌ చేయబోతున్నారు.

ఆయన నేపథ్యంలో నేడు బృందం ముంబయిలో ల్యాండ్‌ కాబోతున్నారు.నేడు ముంబయి పోలీస్‌ కమీషనర్‌ నుండి సుశాంత్‌ మృతికి సంబంధించిన కేసు ఫైల్‌ను మరియు ఇతర వివరాలను తీసుకోబోతున్నారు.

Advertisement

ఆ తర్వాత కేసును విచారించిన పోలీసులను కలిసి మరిన్ని విషయాలను తెలుసుకుంటారు.సీబీఐ వారు ఈ కేసు విషయంలో చాలా పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

సీబీఐకి కేసు అప్పగించారు అంటే చాలా ఏళ్లు పడుతుంది అనే విమర్శలు ఉన్నాయి.కనుక ఈ కేసును త్వరగా పూర్తి చేసి ఆ పేరును పోగొట్టుకోవాలనేది వారి ప్రయత్నంగా తెలుస్తోంది.

నేడు కేసును స్వీకరించి వెంటనే దర్యాప్తును మొదలు పెట్టే అవకాశం ఉంది.సుశాంత్‌ మృతి చెంది ఉన్న రూంను మళ్లీ వీరు పరీక్షించే అవకాశం ఉందని పోలీసు వర్గాల వారు అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు