ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికిన రైతు.. ఎలా అంటే?

ఏంటి ట్రాక్టర్ తో పాలు పితికాడా ? అది ఎలా అబ్బా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఓ రైతు ఇంజినీర్ లా విన్నూతంగా ఆలోచించాడు.

చేతులకు పని లేకుండా కాదు కాదు శారీరక శ్రమ లేకుండా ట్రాక్టర్ తో చిటికెలో ఆవు పాలు పితికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో షేర్ చేసింది మరెవరో కాదు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి తనకు నచ్చిన వీడియోలను నెటిజన్లతో పంచుకొనే మహీంద్రా గ్రూప్‌ అధినేత‌ ఆనంద్ మహింద్రనే ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ గ్రామాల్లో మా ట్రాక్టర్‌లను మల్టీ టాస్క్‌లుగా ఉపయోగిస్తున్న వీడియోలను ప్రజలు నాకు తరచు పంపిస్తున్నారు.

అందులో ఇది నాకు కొత్తగా అనిపించింది.ఇంజనీర్‌ కానీవారు ఇలా చేయగలరా అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు.1.12 నిముషాలు ఉన్న ఆ వీడియోలో మహారాష్ట్రకు చెందిన రైతు ట్రాక్టర్ సాయంతో పాలను పితికే విధానాన్ని వివరించాడు.నాబ్‌లను ఉపయోగించి ట్రాక్టర్‌ ఇంజన్‌ సాయంతో 2, 3 నిమిషాలలో పాలను పితకచ్చు అని చెప్పాడు.

Advertisement

ఇంకా ఈ వీడియోను చుసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు పాల రేటు కంటే ఎక్కువ ఖర్చు పాలు పితకడానికే అవుతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.

Advertisement

తాజా వార్తలు