అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే.ఈ ఘటన తరువాత నల్లజాతీయులు తెలిపిన నిరసనలు ప్రపంచాన్ని కదిలించాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో జార్జ్ మృతికి ప్రతీకగా నిరసనలు తెలిపారు.జార్జ్ హత్య నల్లజాతీయులపై అమెరికా యొక్క జాత్యహకారాన్ని మరొక్కసారి బయటపెట్టిందని జాతీయ మీడియా దుయ్యబట్టింది.
నిరసన కారులు ప్రవైటు వాహనాలు తగుల బెడుతూ, భవనాలు హోటల్స్ ధ్వంసం చేస్తూ సృష్టించిన అలజడికి అమెరికా నేషనల్ దళాలని రంగంలోకి దించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.నిరసన కారులు ఇప్పటికీ తమ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు ఇదిలాఉంటే జార్జ్ ని అమెరికా తెల్ల పోలీసు అధికారి కింద పడేసి మేడపై మొకాలుని ఉంచి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు.
తాజాగా ఇదే విధంగానే మరొక నల్ల జాతీయుడిని అమెరికా పోలీసు అధికారి కింద పడుకోబెట్టి మొకాలుతో అతడి తలని నొక్కిపెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
జార్జ్ మరణానికి కారణమైన ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.
వర్జీనియాలో ఫెయిర్ ఫ్యాక్స్ కౌంటీలో పోలీసు అధికారి నల్లజాతీయుడిపై ఈ విధంగా పాల్పడటం ఇప్పుడు నిరసన కారులకు మరింత ఉద్రేకాన్ని కలిగిస్తోంది.ఈ ఘటన సమయంలో జార్జ్ ఫ్లాయిడ్ మాదిరిగానే అతడు కూడా ఐ కాంట్ బ్రీత్ అంటూ బిగ్గరగా అరిచాడని సాక్షులు తెలిపారు.
అయినా సరే అతడిని విడిచి పెట్టలేదని చివరికి అతడు తీవ్రమైన గాయాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.ఈ ఘటనపై స్పందించిన ఉన్నత అధికారులు సదరు పోలీసుపై దర్యాప్తు చేపట్టారు.